డెత్ జోన్లుగా కొవిడ్ ఆస్పత్రులు.. ఉజ్జయినిలో మరో ఫైర్ యాక్సిడెంట్

దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో దారుణం చోటుచేసుకుంది. కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్న పటిదార్ ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెనువెంటనే బిల్డింగ్‌లోని మూడో అంతస్తుకు మంటలు వ్యాప్తించాయి. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ సిబ్బందికి కాల్ చేయడంతో వారు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తొలుత 80 మంది కరోనా రోగులకు సురక్షితంగా వేరే చోటుకు తరలించారు. ఈ ప్రమాదంలో 9 మంది రోగులకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. వారికి దగ్గరలోని […]

Update: 2021-04-04 05:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో దారుణం చోటుచేసుకుంది. కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్న పటిదార్ ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెనువెంటనే బిల్డింగ్‌లోని మూడో అంతస్తుకు మంటలు వ్యాప్తించాయి. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ సిబ్బందికి కాల్ చేయడంతో వారు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తొలుత 80 మంది కరోనా రోగులకు సురక్షితంగా వేరే చోటుకు తరలించారు.

ఈ ప్రమాదంలో 9 మంది రోగులకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. వారికి దగ్గరలోని వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. తిరిగి క్వారంటైన్ సెంటర్లు ఓపెన్ కాగా, పలు ఆస్పత్రుల్లో వరుస అగ్ని ప్రమాదాలు రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గతంలో ఇదే విధంగా ఏపీలోని విజయవాడ రమేష్ కొవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగి 10మందికి పైగా కరోనా రోగులు మృతిచెందగా, ఇటీవల మహారాష్ట్రలోని కొవిడ్ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో 8 మందికి పైగా రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News