మాజీమంత్రిని చంపేస్తామని బెదిరింపులు.. శశికళపై కేసు నమోదు

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు తలైవి, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ మరో వివాదంలో చిక్కుకున్నారు.  అన్నాడీఎంకే మాజీ నేత సీవీ షణ్ముగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడులోని విల్లుపురం జిల్లా రోషని పోలీసుస్టేషన్‌లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గత కొన్ని రోజుల క్రితం శశికళ గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పటినుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా శశికళ మద్దతుదారులు తనను చంపేస్తామంటూ  బెదిరిస్తున్నారని మాజీ నేత సీవీ  షణ్ముగం ఫిర్యాదులో […]

Update: 2021-06-30 04:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు తలైవి, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ మరో వివాదంలో చిక్కుకున్నారు. అన్నాడీఎంకే మాజీ నేత సీవీ షణ్ముగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడులోని విల్లుపురం జిల్లా రోషని పోలీసుస్టేషన్‌లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గత కొన్ని రోజుల క్రితం శశికళ గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పటినుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా శశికళ మద్దతుదారులు తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని మాజీ నేత సీవీ షణ్ముగం ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు శశిక‌ళ‌పై, ఆమె మద్దతుదారులపై ఐపీసీలోని 506(1), 507, 109 సెక్ష‌న్లతో పాటు ఐటీ యాక్ట్‌లోని 67 సెక్ష‌న్ ప్ర‌కారం కేసు న‌మోదు చేశారు.

Tags:    

Similar News