దుస్తులపై 12 శాతం జీఎస్టీకి నోటిఫై చేసిన ఆర్థిక శాఖ!

దిశ, వెబ్‌డెస్క్: మానవ తయారీ ఫైబర్(ఎంఎంఎఫ్), నూలు, వస్త్రాలు, దుస్తులు అన్నిటిపై 12 శాతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కి అనుమతిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఇప్పటివరకు ఎంఎంఎఫ్‌లపై 18 శాతం, నూలుపై 12 శాతం, వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ అమలవుతోంది. తాజా నిర్ణయం టెక్స్‌టైల్స్ పరిశ్రమలో ఇన్వర్టెడ్ సుంకానికి సంబంధించిన సవాళ్లను పరిష్కరిస్తుంది. సవరించిన జీఎస్టీ రేటు 2022, జనవరి 1 నుంచి అమలు కానుంది. తయారీ పూర్తయిన ఉత్పత్తుల కంటే తయారీలో […]

Update: 2021-11-21 09:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: మానవ తయారీ ఫైబర్(ఎంఎంఎఫ్), నూలు, వస్త్రాలు, దుస్తులు అన్నిటిపై 12 శాతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కి అనుమతిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఇప్పటివరకు ఎంఎంఎఫ్‌లపై 18 శాతం, నూలుపై 12 శాతం, వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ అమలవుతోంది. తాజా నిర్ణయం టెక్స్‌టైల్స్ పరిశ్రమలో ఇన్వర్టెడ్ సుంకానికి సంబంధించిన సవాళ్లను పరిష్కరిస్తుంది. సవరించిన జీఎస్టీ రేటు 2022, జనవరి 1 నుంచి అమలు కానుంది. తయారీ పూర్తయిన ఉత్పత్తుల కంటే తయారీలో వాడే వాటిపై అధిక పన్నులు విధించడం వల్ల ఖర్చులు అధికంగా ఉన్నాయని, దీనివల్ల సరఫరాలో వివిధ దశల్లో ఇంకా పలు రకాల పన్నులు చెల్లించడంతో పరిశ్రమ కీలకమైన మూలధన నిధుల సమస్యలను ఎదుర్కుంటోంది.

ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన, సెప్టెంబర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌లోనే టెక్స్‌టైల్స్ రంగంలో ఇన్వర్టెడ్ సుంకం సవాళ్లను వచ్చే ఏడాది ప్రారంభం లోపు సరిదిద్దాలని నిర్ణయించారు. గతవారమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం దీనికి అనుమతిచ్చింది. ప్రపంచ టెక్స్‌టైల్స్ వ్యాపారం మెరుగ్గా కొనసాగుతోంది. భారత్‌లో ఇన్వర్టెడ్ సుంకం వల్ల అంత వేగంగా ఉండటం లేదు. ప్రస్తుత మార్పులతో పరిశ్రమ వృద్ధి చెందడానికి, అభివృద్ధికి దోహదపడుతుందని నిపుణులు తెలిపారు.

Tags:    

Similar News