ఆనందయ్య మందుపై తుది నివేదిక నేడే
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా కృష్ణంపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందు అధ్యయనంకు సంబంధించి నేడు తుది నివేదిక రానుంది. ఈ నివేదికలను అధ్యయన కమిటీ మరోసారి పరిశీలించనుండగా.. లైసెన్స్ అంశాలపై చర్చించనుంది. నివేదికలు, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మందు పంపిణీపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన నివేదికలన్నీ పాజిటివ్‌గా వచ్చాయని, మందుపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభించలేదన్నారు. ఆయుర్వేద గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకుంటే […]
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా కృష్ణంపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందు అధ్యయనంకు సంబంధించి నేడు తుది నివేదిక రానుంది. ఈ నివేదికలను అధ్యయన కమిటీ మరోసారి పరిశీలించనుండగా.. లైసెన్స్ అంశాలపై చర్చించనుంది. నివేదికలు, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మందు పంపిణీపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు.
ఇప్పటివరకు వచ్చిన నివేదికలన్నీ పాజిటివ్‌గా వచ్చాయని, మందుపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభించలేదన్నారు. ఆయుర్వేద గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకుంటే ప్రాసెస్ చేస్తామని రాములు చెప్పారు. కాగా ఆనందయ్య మందు పంపిణీ ప్రస్తుతం ఆగిపోగా.. అనుమతుల రాకపోవడంతో మందు తయారీని నిలిపివేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత మందు పంపిణీ చేస్తానని, అప్పటివరకు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య సూచించిన విషయం తెలిసిందే.