కేసీఆర్‌ను ఇరికించిన కేటీఆర్.. రేవంత్ చేతికి చిక్కిన తండ్రి కొడుకుల బాగోతం

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లలో మరో కీలక అంశం చేరింది. ఇప్పటి వరకు కేటీఆర్​ టార్గెట్​గా గురి పెట్టిన రేవంత్​కు.. ఆయనే (కేటీఆర్)​ మరో అస్త్రాన్ని అందించారు. తాను రాహుల్​ గాంధీతో పరీక్షలకు సిద్ధమని చెప్తూనే, రాష్ట్ర కాంగ్రెస్​ నేతలను పట్టించుకోను అనే రీతిలో సమాధానమిచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో డ్రగ్స్​ తీసుకున్నట్లు ఆరోపణలపై తాను, రాహుల్​ గాంధీ ఇద్దరం ఢిల్లీ ఎయిమ్స్​లో పరీక్షలకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఇక […]

Update: 2021-09-20 01:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లలో మరో కీలక అంశం చేరింది. ఇప్పటి వరకు కేటీఆర్​ టార్గెట్​గా గురి పెట్టిన రేవంత్​కు.. ఆయనే (కేటీఆర్)​ మరో అస్త్రాన్ని అందించారు. తాను రాహుల్​ గాంధీతో పరీక్షలకు సిద్ధమని చెప్తూనే, రాష్ట్ర కాంగ్రెస్​ నేతలను పట్టించుకోను అనే రీతిలో సమాధానమిచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో డ్రగ్స్​ తీసుకున్నట్లు ఆరోపణలపై తాను, రాహుల్​ గాంధీ ఇద్దరం ఢిల్లీ ఎయిమ్స్​లో పరీక్షలకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఇక ఈ నేపథ్యంలోనే రేవంత్ ​రెడ్డిని ఉద్దేశిస్తూ చర్లపల్లి జైలుకు వెళ్లిన వచ్చిన వారు నా స్థాయి కాదంటూ వ్యాఖ్యానిస్తూ ఓటుకు నోటు కేసును బయటకు తీశారు.

ఇక కేటీఆర్ చేసిన కామెంట్సే కాంగ్రెస్​కు మరో అస్త్రాన్ని అందించినట్లు అయ్యింది. దీనిపై స్పందించిన రేవంత్​రెడ్డి.. సీఎం కేసీఆర్​ను ఇందులోకి లాగారు. తాను రాహుల్​గాంధీని తీసుకువచ్చేందుకు సిద్ధమే అన్నట్టుగా సోషల్​ మీడియాలో రిప్లై ఇచ్చారు. కానీ సీఎం కేసీఆర్​ కూడా లై డిటెక్టర్​కు రావాలని, సహారా కుంభకోణం, ఈఎస్​ఐ కుంభకోణాలతో పాటు సీబీఐ కేసుల విషయంలో లై డిటెక్టర్​కు రావాలంటూ ఆఫర్​ ఇచ్చారు. దీంతో కేటీఆర్​.. ఈ సవాళ్లలో కేసీఆర్​ను ఇరికించినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లు ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికరంగా మారాయి.

Tags:    

Similar News