పాత ధరకే ఎరువులు విక్రయించాలి: కేంద్రం
దిశ,తెలంగాణ బ్యూరో: ఎరువుల ధరలు పెంచొద్దని కేంద్రం ఎరువుల కంపెనీలను ఆదేశించింది. యూరియా మినహా ఇతర ఎరువులను పాత ధరకే విక్రయించాలని ఎరువుల కంపెనీలను కోరింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్‌పీకేల ఎంఆర్‌పీ పెంచొద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ‘ఇఫ్కో‘ (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పోరేషన్ కోఆపరేటీవ్ లిమిటెడ్ కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచుతూ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లివెత్తాయి. కరోనా సమయంలో రైతుల నెత్తిన పిడుగుపడేలా ఎరువులు ధరలు పెంచారని […]
దిశ,తెలంగాణ బ్యూరో: ఎరువుల ధరలు పెంచొద్దని కేంద్రం ఎరువుల కంపెనీలను ఆదేశించింది. యూరియా మినహా ఇతర ఎరువులను పాత ధరకే విక్రయించాలని ఎరువుల కంపెనీలను కోరింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్‌పీకేల ఎంఆర్‌పీ పెంచొద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ‘ఇఫ్కో‘ (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పోరేషన్ కోఆపరేటీవ్ లిమిటెడ్ కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచుతూ ప్రకటనను విడుదల చేసింది.
ఈ ప్రకటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లివెత్తాయి. కరోనా సమయంలో రైతుల నెత్తిన పిడుగుపడేలా ఎరువులు ధరలు పెంచారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 అక్టోబరులో యాభై కిలోల డీఏపీ ధర మార్కెట్‌లో రూ. 1200 ఉంటే ఇప్పుడు దాన్ని రూ. 1900కు పెంచింది. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పాత ధరలకే ఎరువులను విక్రయించాలని కేంద్రం ఎరువుల కంపెనీలను ఆదేశించింది.