మంత్రి కేటీఆర్ ఇలాఖాలో షాకింగ్ న్యూస్.. అంగన్వాడీ స్కూల్లో ‘పైసా వసూల్’
దిశ, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని రామారావు పల్లె గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో నర్సరీ, LKG, UKG పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు చెబుతామని డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.పిల్లలు ఒక్కొక్కరికి వద్ద రూ.300 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించగా అక్కడి ఉపాధ్యాయురాలు జిల్లా కేంద్రానికి మీటింగ్ కోసం వెళ్లగా.. ఆ సమయంలో విధుల్లో ఉన్న ప్రైవేటు టీచర్‌ను దీనిపై ప్రశ్నించగా నిజమేనని.. […]
దిశ, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని రామారావు పల్లె గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో నర్సరీ, LKG, UKG పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు చెబుతామని డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.పిల్లలు ఒక్కొక్కరికి వద్ద రూ.300 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించగా అక్కడి ఉపాధ్యాయురాలు జిల్లా కేంద్రానికి మీటింగ్ కోసం వెళ్లగా.. ఆ సమయంలో విధుల్లో ఉన్న ప్రైవేటు టీచర్‌ను దీనిపై ప్రశ్నించగా నిజమేనని.. తాను కూడా ప్రైవేట్‌గా చదువు చెబుతున్నానని అంగీకరించింది.
పిల్లల తల్లిదండ్రులు ఒక్కొక్కరికీ 300 రూపాయల చొప్పున పాఠశాలకు ఇస్తున్నారు. నాకు కూడా అందులో నుండే రూ.5 వేల జీతం ఇస్తున్నారని.. అంతేకాకుండా ఇంకా ఇద్దరు ప్రైవేట్ టీచర్లకు కూడా ఇందులో నుంచే జీతాలు ఇస్తున్నారని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలలో పైసలు వసూలు చేయడం ఏమిటని అడిగితే నాకు ఏమీ తెలియదు. ప్రధానోపాధ్యాయులు నాకు జీతం చెల్లిస్తున్నారని, వారు రమ్మంటే నేను పిల్లలకి పాఠాలు చెబుతున్నామని అంతకు మించి తమకు ఏమీ తెలియదని వారు వెల్లడించారు.
ఇదే విషయంపై అంగన్వాడీ సూపర్వైజర్ అరుణను వివరణ కోరగా మేము LKG, UKG తరగతులు నిర్వహించడం లేదని, పాఠశాలకు సంబంధించి అన్ని తరగతి గదులు అందుబాటులో లేకపోవడంతో వారు మా గదిని వాడుకుంటున్నారని, అంగన్వాడీ పేరుతో ఎవరిని కూడా డబ్బులు అడగడం లేదన్నారు. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని చెప్పారు. మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస దీక్షితులను దీనిపై వివరణ కోరగా, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల దగ్గర పైసలు వసూలు చేయడం ఎక్కడా కూడా లేదు. ఎవరైనా ఆ విధంగా చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు.
అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ టీచర్లను నియమించుకునే అధికారం మాకు లేదు. ఒక వేళ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గానీ, విద్యా కమిటీ ఆధ్వర్యంలో చందాలు వేసుకొని ప్రైవేటు టీచర్లను నియమించి ఉండవచ్చునని.. అయినా, ప్రైవేటు టీచర్లను నియమించే ఆస్కారం లేదన్నారు.దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. ఇదిలాఉండగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అత్యుత్సాహంతో ప్రైవేటు టీచర్లను నియమించుకుని పేరెంట్స్ దగ్గర నెల, నెల డబ్బులు వసూలు చేసి అందులో నుంచి ప్రైవేటు టీచర్లకు జీతాలు ఇచ్చి మిగతా డబ్బులను జేబుల్లో నింపుకుంటున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులు విద్యా వాలంటరీగా పనిచేసిన మమ్ములను వదిలిపెట్టి ఎవరినో తీసుకువచ్చి చదువు చెప్పించడం సరికాదని బాధిత వాలంటీర్స్ వాపోతున్నారు.