షాకింగ్ న్యూస్.. మేము చనిపోతున్నాం.. పోలీసులకు ఫోన్ చేసి దంపతుల సూసైడ్
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సోకిందని తీవ్ర మనస్థాపానికి లోనైన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని మంగుళూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మంగళూరు చిత్రపూర్‌లోని రహేజా అపార్ట్‌మెంట్‌లో రమేశ్‌కుమార్, గుణ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, ‘మేమిద్దరం కరోనా బారిన పడ్డాం. నా భార్య, నేను సూసైడ్ చేసుకుంటున్నాం. మా అంత్యక్రియలు జరిపించండి’ అని పోలీస్ అధికారికి వివరించిన రమేశ్ వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. తమ తల్లిదండ్రులను క్షేమంగా చూసుకోవాలని, తమ […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సోకిందని తీవ్ర మనస్థాపానికి లోనైన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని మంగుళూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మంగళూరు చిత్రపూర్‌లోని రహేజా అపార్ట్‌మెంట్‌లో రమేశ్‌కుమార్, గుణ దంపతులు నివాసం ఉంటున్నారు.
అయితే, ‘మేమిద్దరం కరోనా బారిన పడ్డాం. నా భార్య, నేను సూసైడ్ చేసుకుంటున్నాం. మా అంత్యక్రియలు జరిపించండి’ అని పోలీస్ అధికారికి వివరించిన రమేశ్ వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. తమ తల్లిదండ్రులను క్షేమంగా చూసుకోవాలని, తమ అంత్యక్రియలకు కావలసిన డబ్బును ఇంట్లో ఉంచుతున్నామన్న వాయిస్ మెసేజ్‌ను తన స్నేహితులకు పంపిచాడు.
అంతకు ముందు గుణ రాసిన సూసైడ్ నోట్‌లో ‘నాకు కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నాయి. నా భర్తకు కరోనా ఉంది. అందుకే మేము చనిపోదామని నిర్ణయించుకున్నాం. మా ఇంటి సామాన్లు, ఇతర వస్తువులను పేదలకు పంచండి’ అని రాసి ఉంది. దీంతో వారు కరోనా సోకిందనే మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.