మెసెంజర్ యాప్‌లో బగ్.. గుర్తించిన టెకీ
దిశ, వెబ్‌డెస్క్: యాప్స్, వెబ్‌సైట్స్‌కు సంబంధించిన హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్స్‌లో తలెత్తే లోపాలను బగ్స్‌గా చెబుతుంటారు. ఆ బగ్స్ వల్ల సదరు ప్రోగ్రామ్ సరిగా రన్ కాకపోవడంతో పాటు హ్యాకర్లు సులభంగా కంప్యూటర్ లేదా మొబైల్‌లోకి ప్రవేశించి, మన విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. అందుకే ప్రముఖ యాప్స్.. బగ్స్ కనిపెట్టిన వారికి లక్షలు, కోట్లలో ప్రైజ్‌మనీ అందిస్తుంటాయి. ఫేస్‌బుక్ ఏకంగా ‘బగ్ బౌంటీ’ ప్రొగ్రామ్ కూడా నిర్వహిస్తోంది. అయినా ఏదో ఒక బగ్ వల్ల […]
దిశ, వెబ్‌డెస్క్: యాప్స్, వెబ్‌సైట్స్‌కు సంబంధించిన హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్స్‌లో తలెత్తే లోపాలను బగ్స్‌గా చెబుతుంటారు. ఆ బగ్స్ వల్ల సదరు ప్రోగ్రామ్ సరిగా రన్ కాకపోవడంతో పాటు హ్యాకర్లు సులభంగా కంప్యూటర్ లేదా మొబైల్‌లోకి ప్రవేశించి, మన విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. అందుకే ప్రముఖ యాప్స్.. బగ్స్ కనిపెట్టిన వారికి లక్షలు, కోట్లలో ప్రైజ్‌మనీ అందిస్తుంటాయి. ఫేస్‌బుక్ ఏకంగా ‘బగ్ బౌంటీ’ ప్రొగ్రామ్ కూడా నిర్వహిస్తోంది. అయినా ఏదో ఒక బగ్ వల్ల సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌లో ఇటీవలే ఓ బగ్‌ను కనిపెట్టిన గూగుల్ ఉద్యోగికి భారీ ప్రైజ్‌మనీ అందించింది ఫేస్‌బుక్.
ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌లోని ఓ బగ్ వల్ల, హ్యాకర్లు యూజర్ అనుమతి లేకుండానే వారి ఆడియో కాల్స్ వినే అవకాశం ఉందని గూగుల్ ప్రాజెక్ట్ జీరో బగ్-హంటింగ్ సెక్యూరిటీ టీమ్‌లో పనిచేసే నటాలీ సిల్వనోవిచ్ గుర్తించింది. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లోనే ఈ బగ్ ఉన్నట్లు ఆమె తెలిపింది. ఈ బగ్ ఇష్యూను ఫేస్‌బుక్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ లోపాన్ని గుర్తించినందుకు గాను సిల్వనోవిచ్‌కు 60 వేల డాలర్ల (సుమారు 44 లక్షలు రూపాయిలు)ను గిఫ్ట్‌గా అందించింది.
సిల్వనోవిచ్ గుర్తించిన బగ్ ఇష్యూను ప్రస్తుతం సరిచేసినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ప్రస్తుత డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ యుగంలో సైబర్ ఎటాక్స్ ఓ పెద్ద వ్యాపారంగా మారింది. మల్టీనేషన్ కంపెనీల సాఫ్ట్‌వేర్లలో బగ్స్‌ను కనుగొని ఫిక్స్ చేయడం ద్వారా కొన్ని కంపెనీలతో పాటు ఎథికల్ హ్యాకర్లు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.