డొనాల్డ్ ట్రంప్‌పై ఎఫ్‌బీ రెండేళ్ల నిషేధం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఫేస్‌బుక్ రెండేళ్ల నిషేధం విధించింది. ఫేస్‌బుక్ సహా ఇన్‌స్టాలోనూ ఆయనపై 2023 జనవరి 7వ తేదీ వరకు నిషేధం అమలు కానుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల సమయంలో క్యాపిటల్ భవనంపై అల్లర్లకు ప్రేరేపించారన్న అభియోగాలతో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 6న జరిగిన అల్లర్ల తర్వాత ఆయనపై బ్యాన్ అమలు చేసింది. ఫేస్‌బుక్ ఏర్పాటు చేసిన స్వతంత్ర ప్యానెల్ ఆయనపై జీవిత కాలం నిషేధం సరికాదని, […]
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఫేస్‌బుక్ రెండేళ్ల నిషేధం విధించింది. ఫేస్‌బుక్ సహా ఇన్‌స్టాలోనూ ఆయనపై 2023 జనవరి 7వ తేదీ వరకు నిషేధం అమలు కానుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల సమయంలో క్యాపిటల్ భవనంపై అల్లర్లకు ప్రేరేపించారన్న అభియోగాలతో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 6న జరిగిన అల్లర్ల తర్వాత ఆయనపై బ్యాన్ అమలు చేసింది. ఫేస్‌బుక్ ఏర్పాటు చేసిన స్వతంత్ర ప్యానెల్ ఆయనపై జీవిత కాలం నిషేధం సరికాదని, ఆరు నెలలపాటు బ్యాన్ అమలు చేయాలని సూచించింది.
కానీ, డొనాల్డ్ ట్రంప్ చర్యలు తీవ్రంగా పరిగణించిన ఫేస్‌బుక్ రెండేళ్లపాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధ గడువు ముగిసిన తర్వాతా ట్రంప్ తన వైఖరి మార్చుకోకుంటే ఆంక్షలు అమలు చేస్తామనీ హెచ్చరించింది. ఇప్పటి వరకు రాజకీయ నేతలకు, సాధారణ యూజర్లకు మధ్య కంటెంట్‌పై భిన్న విధానాన్ని అమలు చేస్తూ పర్యవేక్షిస్తున్నది. రాజకీయ నేతలు కొన్ని వివాదాస్పదంగా ఉన్నప్పటికీ ప్రజలకు చేరాల్సిన ఉంటుందన్న అభిప్రాయంతో వారిపై ఉదాసీనతను అవలంభించినట్టు తెలిసింది. కానీ, తాజాగా ఈ నిబంధనను మార్చినట్టు తెలిసింది.