భారత్‌లో లాక్‌డౌన్ విధించాలి.. ఫౌసీ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో లాక్‌డౌన్ విధించాలని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌసీ సూచించారు. లాక్‌డౌన్ విధిస్తేనే వైరస్ సంక్రమణ విచ్ఛిన్నం అవుతుందని వెల్లడించారు. భారత్‌లో పరిస్థితి చేయిదాటకముందే చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌లో మూడు, నాలుగు వారాల పాటు లాక్‌డౌన్ విధిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని సూచించారు. లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన వద్దని ఫౌసీ సూచించారు. కష్టకాలంలో భారత్ ఎన్నో దేశాలకు అండగా నిలిచిందని, ఇప్పుడు భారత్‌కు ప్రపంచ దేశాలు […]

Update: 2021-05-07 04:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో లాక్‌డౌన్ విధించాలని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌసీ సూచించారు. లాక్‌డౌన్ విధిస్తేనే వైరస్ సంక్రమణ విచ్ఛిన్నం అవుతుందని వెల్లడించారు. భారత్‌లో పరిస్థితి చేయిదాటకముందే చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌లో మూడు, నాలుగు వారాల పాటు లాక్‌డౌన్ విధిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని సూచించారు.

లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన వద్దని ఫౌసీ సూచించారు. కష్టకాలంలో భారత్ ఎన్నో దేశాలకు అండగా నిలిచిందని, ఇప్పుడు భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలవాలని ఫౌసీ తెలిపారు.

Tags:    

Similar News