ఓ తండ్రీకొడుకుల పని.. వేస్ట్ మెటీరియల్‌తో మోడీ విగ్రహం!
దిశ, ఫీచర్స్ : ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని తెనాలికి చెందిన ఆర్టిస్ట్ కాటూరు వెంకటేశ్వర రావు.. కొడుకు రవితో కలిసి పూర్తి స్క్రాప్ మెటీరియల్‌తో 14 అడుగుల ఎత్తైన భారత ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహాన్ని తయారుచేశారు. ఇక రెండు నెలల పాటు కష్టపడి తయారుచేసిన ఈ ప్రతిమను త్వరలోనే బెంగళూరు నగరంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు బయటపడేసిన వేస్ట్ మెటీరియల్‌తో విగ్రహాలను తయారుచేస్తామంటున్న ఆర్టిస్ట్ వెంకటేశ్వర రావు.. ఒక్కో శిల్పం టన్ను కన్నా ఎక్కువ […]
దిశ, ఫీచర్స్ : ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని తెనాలికి చెందిన ఆర్టిస్ట్ కాటూరు వెంకటేశ్వర రావు.. కొడుకు రవితో కలిసి పూర్తి స్క్రాప్ మెటీరియల్‌తో 14 అడుగుల ఎత్తైన భారత ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహాన్ని తయారుచేశారు. ఇక రెండు నెలల పాటు కష్టపడి తయారుచేసిన ఈ ప్రతిమను త్వరలోనే బెంగళూరు నగరంలో ఏర్పాటు చేయబోతున్నారు.
ఆటోమొబైల్ కంపెనీలు బయటపడేసిన వేస్ట్ మెటీరియల్‌తో విగ్రహాలను తయారుచేస్తామంటున్న ఆర్టిస్ట్ వెంకటేశ్వర రావు.. ఒక్కో శిల్పం టన్ను కన్నా ఎక్కువ బరువు ఉంటుందని వెల్లడించాడు. ముందుగా నట్లు, బోల్టులతో విగ్రహం తయారీ పని మొదలుపెడతామని, ఆ తర్వాత మెటల్ చైన్లు, కాగ్స్, వీల్స్, రాడ్స్, షీట్స్, ఇతరత్రా స్ర్కాప్ మెటల్‌ను వినియోగిస్తామని తెలిపాడు. ఇక మోడీ విగ్రహం విషయానికొస్తే.. కళ్లజోడు, హెయిర్‌స్టైల్, గడ్డం నేచరల్‌గా కనిపించేందుకు GI వైర్‌ను ఉపయోగించామన్నాడు. ఈ విగ్రహ తయారీలో ఈ తండ్రీకొడుకులకు మరో 10 మంది వర్కర్లు సహాయం చేయగా, దీన్ని పూర్తిచేసేందుకు 600 గంటల సమయం పట్టిందని తెలిపాడు. ఇక బీజేపీ కార్పొరేటర్ మోహన్ రాజు ఈ విగ్రహానికి అయ్యే పూర్తి ఖర్చులు భరించారు.
‘సాధారణంగా కాంస్య విగ్రహాలను తప్ప పర్ఫెక్ట్ ఫీచర్స్‌తో కూడిన విగ్రహాలను స్క్రాప్ ఆర్ట్‌లో చేయలేరు. పైగా అందుబాటులో ఉన్న స్క్రాప్‌తోనే సదరు వ్యక్తుల ముఖ లక్షణాలను తీసుకురావడం కష్టం. మా ప్రయత్నాలు మహాత్మా గాంధీ విగ్రహంతో ప్రారంభమయ్యాయి. గాంధీజీ విగ్రహంలో దాదాపు 75వేల నట్లు, బోల్ట్‌లు ఉపయోగించాం. ప్రస్తుతం మోడీ విగ్రహానికి గేర్ వీల్స్, వాషర్లు, బోల్ట్‌లు, నట్లు వంటి దాదాపు రెండు టన్నుల స్క్రాప్ ఉపయోగించాం’ అని ఆర్టిస్ట్ రవి వివరించారు.
హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, చెన్నైలోని స్క్రాప్ డీలర్ల నుంచి మెటీరియల్ సేకరించారు. ఇక ఈ విగ్రహం గురించి తెలుసుకుని వారి వర్క్‌షాప్‌ను సందర్శించిన తెనాలి శాసనసభ్యుడు అన్నబట్టు శివకుమార్.. ఆ ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చినందుకు తండ్రీకొడుకులను ప్రత్యేకంగా అభినందించారు. కాగా ఈ విగ్రహాన్ని ఈ నెల 16న బెంగుళూరు నగరానికి తరలిస్తున్నారు.