తండ్రీ కొడుకులను బలిగొన్న కరోనా..
దిశ, మంచిర్యాల : రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ నెమ్మదిగా తీవ్రరూపం దాలుస్తోంది. తాజాగా కరోనా దెబ్బకు తండ్రీ కొడుకులిద్దరూ మృతి చెందారు. గంటన్నర వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకివెళితే.. చింతపండు వాడకు చెందిన వృద్ధుడు(88) అతని కుమారుడు (52) కరోనా బారిన పడి సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. వారం కిందట తొలుత కుమారుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో మంచిర్యాలలో పరీక్షలు […]
దిశ, మంచిర్యాల : రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ నెమ్మదిగా తీవ్రరూపం దాలుస్తోంది. తాజాగా కరోనా దెబ్బకు తండ్రీ కొడుకులిద్దరూ మృతి చెందారు. గంటన్నర వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకివెళితే.. చింతపండు వాడకు చెందిన వృద్ధుడు(88) అతని కుమారుడు (52) కరోనా బారిన పడి సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. వారం కిందట తొలుత కుమారుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో మంచిర్యాలలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.
దీంతో తల్లిదండ్రులకు కూడా పరీక్ష చేయించగా వారికి కూడా పాజిటివ్ రావడంతో జిల్లా కేందంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం 12.30కు కుమారుడు మృతి చెందగా, గంటన్నర వ్యవధిలో తండ్రి మృతి చెందాడు. వృద్ధుడి భార్య అదే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రి సిబ్బంది కరోనా నిబంధనల ప్రకారం మృతదేహాలను దహనం చేశారు. తండ్రి, కుమారులు మృతి చెందిన ఘటనను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నీరజ ధ్రువీకరించారు.