ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పులను వేగవంతం చేయాలి

దిశ, తెలంగాణ బ్యూరో : సైదాబాద్‌లో ఆరేళ్ల పాపపై జరిగిన ఘటన చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో లైంగిక వేధింపులు, హత్య ఘటనలపై వెనువెంటనే విచారణ జరిపి, నిందితులకు తక్షణమే శిక్ష ఖరారు చేసి బాధితులకు అండగా నిలవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్నిసార్లు ఫోరెన్సిక్‌తోపాటు కొన్ని నివేదికలు రావడం ఆలస్యం అవుతుందని, వైద్యులు, […]

Update: 2021-09-12 07:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సైదాబాద్‌లో ఆరేళ్ల పాపపై జరిగిన ఘటన చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో లైంగిక వేధింపులు, హత్య ఘటనలపై వెనువెంటనే విచారణ జరిపి, నిందితులకు తక్షణమే శిక్ష ఖరారు చేసి బాధితులకు అండగా నిలవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్నిసార్లు ఫోరెన్సిక్‌తోపాటు కొన్ని నివేదికలు రావడం ఆలస్యం అవుతుందని, వైద్యులు, దర్యాప్తు అధికారులు నిర్లక్ష్యం ఒకదానికి ఒకటి తోడే సమస్య పరిష్కారానికి సమయం పడుతుందన్నారు. వీటాన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీర్పులపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

కొంత మంది బాధితుల ఇంటికి పరామర్శకి వెళ్లనప్పుడు ‘మేం బతికి ఉండగానే మాకు న్యాయం జరగాలన్నది మా కోరిక.’ అని పేర్కొన్నారని, బాధిత కుటుంబాలకు చట్టం పై నమ్మకం పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అమ్మాయిలపై అత్యాచారం చేయాలంటే భయపడాలని, అలాంటి కఠిన చట్టాలను తెవాలన్నారు. అలాగే బాధితులకు, బాధిత కుటుంబాలను సత్వరం న్యాయం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మొన్న ఆంధ్రప్రదేశ్‌లో రమ్య, అనూష, నరసరావుపేట౼సత్తెనపల్లి మధ్యలో ఒక మహిళ పై బీహార్ కూలీలు అఘాయిత్యం చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్ ఏమైపోతుందో అని భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం 2013 చివరి నాటికి, పెండింగ్‌లో ఉన్న అత్యాచారం కేసుల సంఖ్య 95వేలు. 2019 చివరి నాటికి ఇది లక్షా 45 వేలకు పెరిగింది. 2021 నాటికి ఈ సంఖ్య రెండు లక్షలకు చేరడం చూస్తుంటే.. రూపొందించిన చట్టాలు నిందితులకు చుట్టాలుగా మారాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News