పాకిస్తాన్‌ది అవకాశవాదం
న్యూఢిల్లీ: ‘గుప్కార్ డిక్లరేషన్’పై పాకిస్తాన్ ప్రశంసించడాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. పాకిస్తాన్‌ది అవకాశవాదమేనని విమర్శించారు. జమ్ము కశ్మీర్ ప్రధాన స్రవంతి రాజకీయపార్టీలపై ఆది నుంచీ పాకిస్తాన్ దుమ్మెత్తిపోసిందని, ఇప్పుడు అనూహ్యంగా ప్రేమ ఒలకబోస్తున్నదని ఫరూఖ్ అన్నారు. ఈ విషయంలో వైఖరిని స్పష్టం చేస్తూ తాము ఎవరి చెప్పుచేతల్లో లేమన్నారు. మొదటి నుంచీ కశ్మీర్ ప్రజలకు జవాబుదారీగా ఉన్నామని, ఇకపైనా వారికే సేవలందిస్తామని స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 […]
న్యూఢిల్లీ: ‘గుప్కార్ డిక్లరేషన్’పై పాకిస్తాన్ ప్రశంసించడాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. పాకిస్తాన్‌ది అవకాశవాదమేనని విమర్శించారు. జమ్ము కశ్మీర్ ప్రధాన స్రవంతి రాజకీయపార్టీలపై ఆది నుంచీ పాకిస్తాన్ దుమ్మెత్తిపోసిందని, ఇప్పుడు అనూహ్యంగా ప్రేమ ఒలకబోస్తున్నదని ఫరూఖ్ అన్నారు.
ఈ విషయంలో వైఖరిని స్పష్టం చేస్తూ తాము ఎవరి చెప్పుచేతల్లో లేమన్నారు. మొదటి నుంచీ కశ్మీర్ ప్రజలకు జవాబుదారీగా ఉన్నామని, ఇకపైనా వారికే సేవలందిస్తామని స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణం పునరుద్ధరణకు పోరాడుతామని కశ్మీర్ పార్టీలన్ని సంయుక్తంగా ‘గుప్కార్ డిక్లరేషన్’ను గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ డిక్లరేషన్ అసాధారణమైన చర్య అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రశంసించింది.