అధికారులను బంధించిన రైతులు.. ఎందుకంటే ?

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దగడ పల్లి గ్రామపంచాయతీ వద్ద పలువురు అధికారులను రైతులు బ్యాక్ వెల్‌లో వేసి బంధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూరాల, భీమ ప్రాజెక్టుల నుండి కాలువల ద్వారా పుష్కలంగా నీరు వస్తుందని భావించి చిన్నంబావి మండలం‌లోని పలు గ్రామాల ప్రజలతో పాటు, కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల‌లోనూ రైతులు వరి తదితర పంటలను సాగు చేశారు. గత కొన్ని వారాల నుండి కాలువల ద్వారా […]

Update: 2021-10-28 02:07 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం దగడ పల్లి గ్రామపంచాయతీ వద్ద పలువురు అధికారులను రైతులు బ్యాక్ వెల్‌లో వేసి బంధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూరాల, భీమ ప్రాజెక్టుల నుండి కాలువల ద్వారా పుష్కలంగా నీరు వస్తుందని భావించి చిన్నంబావి మండలం‌లోని పలు గ్రామాల ప్రజలతో పాటు, కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల‌లోనూ రైతులు వరి తదితర పంటలను సాగు చేశారు. గత కొన్ని వారాల నుండి కాలువల ద్వారా నీళ్లు రాకపోవడంతో చేన్లు ఎండు ముఖం పట్టాయి.

ఈ విషయమై రైతులు పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో పలువురు రైతులు 2 రోజుల క్రితం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి వద్దకు వెళ్లి సమస్య తీవ్రతను గురించి వివరించారు. దీనితో సమస్యను పరిశీలించేందుకు బుధవారం సాయంత్రం డిప్యూటీ సీ ఈ, ఇద్దరు ఇతర అధికారులు కాల్వలను పరిశీలించడానికి వచ్చారు. ఆగ్రహంతో ఉన్న పలువురు రైతులు వారిని దగడ పల్లి‌లో ఉన్న బ్యాక్ వెల్‌‌లో వేసి తాళాలు వేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించే వరకు అధికారులను వదిలేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పలువురు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి చేరవేశారు. రెండు మూడు రోజులలో సమస్యను పరిష్కరిస్తామని ఉన్నత అధికారులు హామీ ఇవ్వడంతో దాదాపు ఐదు గంటల పాటు నిర్బంధంలో ఉన్న అధికారులను రైతులు విడుదల చేశారు.

Tags:    

Similar News