జూన్ 15 నుంచి రైతు బంధు సాయం : కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. జూన్ 15 నుంచి 25 వరకు రైతు బంధు సాయం అందించనున్నట్లు ప్రకటించారు. రైతు బంధు సాయాన్ని ఆర్థిక శాఖ జమ చేయనుందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఈసారి ఖరీఫ్ సీజన్ లో కల్తీ విత్తనాలు తయారు చేసినా, సప్లయ్ చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. బయోపెస్టిసైడ్ పేరుతో మోసం చేస్తే పీడీయాక్ట్ పెడుతామన్నారు. రైతులను దగా చేసే వారిపట్ల వ్యవసాయ […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. జూన్ 15 నుంచి 25 వరకు రైతు బంధు సాయం అందించనున్నట్లు ప్రకటించారు. రైతు బంధు సాయాన్ని ఆర్థిక శాఖ జమ చేయనుందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఈసారి ఖరీఫ్ సీజన్ లో కల్తీ విత్తనాలు తయారు చేసినా, సప్లయ్ చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. బయోపెస్టిసైడ్ పేరుతో మోసం చేస్తే పీడీయాక్ట్ పెడుతామన్నారు. రైతులను దగా చేసే వారిపట్ల వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లేనియెడల వారిని డిస్మిస్ చేస్తామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. విత్తనాలు కల్తీ చేసిన వారికి ఐదేళ్లు జైలు శిక్ష తప్పదన్నారు.
ఈసారి క్యూఆర్ కోడ్ విధానాన్ని తప్పనిసరిగా అమలుచేయాలని సంబంధిత వ్యవసాయ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో కోటి ఎకరాల మాగాణి చేయడంలో తాము విజయం సాధించినట్లు కేసీఆర్ తెలిపారు. కోర్టు్ల్లో కేసులు వేసి అడ్డుకున్నా.. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశామని వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని కేసీఆర్ వ్యవసాయ శాఖను ఆదేశించారు.