టెన్షన్.. టెన్షన్.. పోటాపోటీగా నిరసనలు.. MP అరవింద్ రాజీనామాకు డిమాండ్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం తల్వేద గ్రామంలో పోటాపోటీ ఆందోళనలు జరుగుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గ్రామస్తులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తుండగా.. గ్రామాభివృద్ధి కార్యాలయం ఎదుట పసుపు రైతులు మంగళవారం నిరసన చేపట్టారు. గత కొన్ని రోజులుగా తల్వేద పంచాయతీ కార్యాలయం ఎదుట అర్హులైన వారికి డబుల్ ఇండ్లు ఇవ్వాలని పార్టీలకు అతీతంగా గ్రామస్తులు మన ఊరు-మన బాధ్యత అనే గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం తల్వేద గ్రామంలో పోటాపోటీ ఆందోళనలు జరుగుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గ్రామస్తులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తుండగా.. గ్రామాభివృద్ధి కార్యాలయం ఎదుట పసుపు రైతులు మంగళవారం నిరసన చేపట్టారు.
గత కొన్ని రోజులుగా తల్వేద పంచాయతీ కార్యాలయం ఎదుట అర్హులైన వారికి డబుల్ ఇండ్లు ఇవ్వాలని పార్టీలకు అతీతంగా గ్రామస్తులు మన ఊరు-మన బాధ్యత అనే గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ఈ నిరసన వెనుక బీజేపీ ప్రోద్బలం ఉందని టీఆర్ఎస్ నాయకులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తల్వేద గ్రామాభివృద్ధి కమిటీ కార్యాలయం ఎదుట పసుపు రైతులు నిరసన దీక్షకు కూర్చున్నారు. ఈ నిరసన దీక్షకు టీఆర్ఎస్ మద్దతు పలికింది.
బీజేపీ ఎంపీ అరవింద్ రాసిచ్చిన బాండ్‌కు 1000 రోజులు గడిచాయని.. వెంటనే రాజీనామా చేసి పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించాలని కోరారు. గ్రామంలో పోటాపోటీ నిరసనలతో రాజకీయం వేడెక్కింది. గ్రామంలో పోటా పోటీ నిరసనలతో పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కల.. కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. పార్టీల పేరుతో దీక్షల కారణంగా మొదటికే మోసం వచ్చే పరిస్థితి నెలకొంది.