సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాళ్లోకి వెళితే.. జిల్లాలోని చివ్వెంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన రైతు మందడి రాంరెడ్డికి ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 248లో ఐదు గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి రాంరెడ్డి పక్క పొలానికి ఓ రైతు పేరుమీద ఉంది. దీనిని తన పేరుమీద చేయాలని, పాస్‌బుక్ ఇప్పించాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎంతకీ రెవెన్యూ […]

Update: 2021-06-30 05:25 GMT

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాళ్లోకి వెళితే.. జిల్లాలోని చివ్వెంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన రైతు మందడి రాంరెడ్డికి ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 248లో ఐదు గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి రాంరెడ్డి పక్క పొలానికి ఓ రైతు పేరుమీద ఉంది. దీనిని తన పేరుమీద చేయాలని, పాస్‌బుక్ ఇప్పించాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎంతకీ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాంరెడ్డి బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గమనించిన పోలీసులు ఆయన వద్ద మందు డబ్బా లాక్కొని మందలించారు.

Tags:    

Similar News