ఉరితాడు ఇవ్వండి.. ప్రశాంతంగా సచ్చిపోతాం..

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని రైస్ మిల్లులో క్వింటాలుకు 12 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని ఆరోపిస్తూ అన్నదాతలు సిరిసిల్ల-కామారెడ్డి రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై అడ్డంగా కంచె వేసి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. 40 కిలోల ధాన్యం బస్తాకు 3 నుంచి నాలుగు కిలోలు తరుగు తీస్తున్నారన్నారు. […]

Update: 2021-12-14 02:10 GMT

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని రైస్ మిల్లులో క్వింటాలుకు 12 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని ఆరోపిస్తూ అన్నదాతలు సిరిసిల్ల-కామారెడ్డి రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై అడ్డంగా కంచె వేసి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. 40 కిలోల ధాన్యం బస్తాకు 3 నుంచి నాలుగు కిలోలు తరుగు తీస్తున్నారన్నారు. క్వింటాలుకు దాదాపు 12 కిలోల తరుగు పోతుందని, ప్రభుత్వం చెప్పినట్టుగా ఒకటిన్నర కిలోల తరుగు తీయడం లేదని వాపోయారు.

రైస్ మిల్లర్లు నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషికి ఒక పత్తి మందు సీసా, ఉరి తాడు ఇవ్వండి చచ్చిపోతాం.. ఇంతగానం ఇబ్బంది పెట్టుడు ఎందుకు అని ప్రశ్నించారు. తినడానికి తిండి లేదు, పంటలో లాభము లేదు, ఎక్కడికక్కడ దిక్కు లేక సచ్చిపోతున్నాం మేము అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్, పోలీసులు వచ్చి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Tags:    

Similar News