యువ రైతును బలితీసుకున్న అప్పులు..

దిశ, మక్తల్ : అప్పుల బాధ భరించలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుగొండలో బుధవారం వెలుగుచేసింది. గ్రామ సర్పంచ్ రమేశ్ కథనం ప్రకారం.. అనుగొండకు చెందిన చెన్నప్ప (32)కు ఊర్లో మూడెకరాల మూమి ఉంది. అందులో వరి పంట సాగుచేశాడు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట మొత్తం నాశనమైంది. ఊర్లో ఉపాధి పనులు కూడా దొరకడం లేదు. దీంతో గతంలో చేసిన అప్పులు […]

Update: 2021-10-27 07:29 GMT

దిశ, మక్తల్ : అప్పుల బాధ భరించలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుగొండలో బుధవారం వెలుగుచేసింది.
గ్రామ సర్పంచ్ రమేశ్ కథనం ప్రకారం.. అనుగొండకు చెందిన చెన్నప్ప (32)కు ఊర్లో మూడెకరాల మూమి ఉంది. అందులో వరి పంట సాగుచేశాడు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట మొత్తం నాశనమైంది. ఊర్లో ఉపాధి పనులు కూడా దొరకడం లేదు.

దీంతో గతంలో చేసిన అప్పులు తీర్చాలని ఒత్తిడి ఎక్కువైంది. ఈ క్రమంలోనే అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని మక్తల్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి మరల హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్టు సర్పంచ్ రమేశ్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News