అధికారులు చేసిన పనికి రైతు ఆత్మహత్యాయత్నం

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పంట పొలాల్లో హరితహరం మొక్కలను నాటాడాన్ని నిరసిస్తూ రైతులు నిరసనకు దిగారు. రోడ్డుపై అడ్డంగా బైటాయించారు. ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం ఉదయం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల శివారులో జరిగింది. రైతుల కథనం ప్రకారం.. హరితాహారం కార్యక్రమంలో భాగంగా రామారెడ్డి గ్రామ పరిధిలోని నాట్లు వేసిన వ్యవసాయ పొలాల్లో మొక్కలు నాటారని రైతులు తెలిపారు. రోడ్డుకు 25 అడుగుల లోపలికి వచ్చి మొక్కలు నాటారని […]

Update: 2021-07-31 00:42 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పంట పొలాల్లో హరితహరం మొక్కలను నాటాడాన్ని నిరసిస్తూ రైతులు నిరసనకు దిగారు. రోడ్డుపై అడ్డంగా బైటాయించారు. ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం ఉదయం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల శివారులో జరిగింది. రైతుల కథనం ప్రకారం..

హరితాహారం కార్యక్రమంలో భాగంగా రామారెడ్డి గ్రామ పరిధిలోని నాట్లు వేసిన వ్యవసాయ పొలాల్లో మొక్కలు నాటారని రైతులు తెలిపారు. రోడ్డుకు 25 అడుగుల లోపలికి వచ్చి మొక్కలు నాటారని చెప్పారు. ఇప్పటికే తాము నాట్లు కూడా వేసుకున్నామని, అయినా అధికారులు పొలాల్లో అవెన్యూ ప్లాంటేషన్ పేరిట మొక్కలు నాటడం ఏంటని ప్రశ్నించారు. తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పొలాల్లో గుంతలు తీసి మొక్కలు పాతిపోయారని మండిపడ్డారు. వెంటనే నాటిన మొక్కలను తొలగించాలని డిమాండ్ చేశారు.

అయితే తన పొలంలో మొక్కలు నాటడాన్ని నిరసిస్తూ యలయ్య అనే రైతు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే తోటి రైతులు అతడిని అడ్డుకున్నారు. పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. పంటలను వేసిన తరువాత మొక్కలను నాటడం వల్ల తాము నష్టపోతామని రైతులు వాపోయారు.

Tags:    

Similar News