నాకు న్యాయం చేయండి : రైతు
దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు తనకు న్యాయం చేయాలని బైఠాయించాడు. మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన చెన్నయ్య అనే రైతుకు నాలుగు ఎకరాల 12 కుంటల భూమి ఉంది. కాగా గతంలో అతను చేసిన అప్పుల కారణంగా ఒక ఎకరం అమ్మేశాడు. అయితే ఇటీవల మీసేవా కేంద్రంలోకి వెళ్లగా తనకు పేరుమీద 9 గుంటలు మాత్రమే ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో ఆందోళన చెందిన […]
దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు తనకు న్యాయం చేయాలని బైఠాయించాడు. మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన చెన్నయ్య అనే రైతుకు నాలుగు ఎకరాల 12 కుంటల భూమి ఉంది. కాగా గతంలో అతను చేసిన అప్పుల కారణంగా ఒక ఎకరం అమ్మేశాడు. అయితే ఇటీవల మీసేవా కేంద్రంలోకి వెళ్లగా తనకు పేరుమీద 9 గుంటలు మాత్రమే ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో ఆందోళన చెందిన రైతు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. దీనిపై పలుమార్లు అధికారులకు వినతిపత్రం సమర్పించినా పట్టించుకోకపోగా, లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేదేమీ లేక శనివారం కార్యాలయం ఎదుట బైఠాయించాడు. తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు.