నీళ్లు పెట్టేందుకు చెరువులోకి దిగి.. మూగజీవాలతో సహా రైతు మృతి

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జిలకుంట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి వంగల జలపతి రెడ్డి అనే రైతుతో సహా పశువులు సైతం మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే.. జలపతి రెడ్డి వ్యవసాయ పనులు ముగించుకొని ఎడ్లబండితో ఇంటికి వస్తుండగా ఎద్దులకు చెరువులో నీళ్లు పెట్టేందుకు చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు ఎడ్ల బండి చెరువులోని గుంతలో ఇరుక్కోవడంతో జలపతి రెడ్డితో సహా ఒక ఎద్దు ఒక బర్రె మృతిచెందాయి. ఘటన […]

Update: 2021-05-09 05:18 GMT

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జిలకుంట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి వంగల జలపతి రెడ్డి అనే రైతుతో సహా పశువులు సైతం మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే.. జలపతి రెడ్డి వ్యవసాయ పనులు ముగించుకొని ఎడ్లబండితో ఇంటికి వస్తుండగా ఎద్దులకు చెరువులో నీళ్లు పెట్టేందుకు చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు ఎడ్ల బండి చెరువులోని గుంతలో ఇరుక్కోవడంతో జలపతి రెడ్డితో సహా ఒక ఎద్దు ఒక బర్రె మృతిచెందాయి. ఘటన స్థలికి పోత్కపల్లి ఎస్సై లక్ష్మణ్ ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. రైతు మృతి చెందడంతో జీలకుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రైతు మరణం బాధాకరం : రాజు రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు

జీలకుంట గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోవడం చాలా బాధాకరమన్నారు. మండలంలోని రైతులు ఎవరైనా ఎడ్లకు చెరువు వద్ద నీళ్ళు పెట్టేటప్పుడు ఎడ్లబండికి ఉన్న ఎద్దులను విడిచి నీరు పెట్టుకోవాలని సూచించారు.అలాగే రైతులు కూడా ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News