ఆ పేరుతో టెండుల్కర్‌ను తొక్కేయకండి: ఫర్హాన్ అక్తర్
దిశ, సినిమా: పొలిటికల్ అండ్ సోషల్ ఇష్యూస్‌పై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండుల్కర్‌పై వస్తున్న ట్రోలింగ్స్‌పై తన ఒపీనియన్ చెప్పారు. ఐపీఎల్ – 2021 టీ-20 సిరీస్ కోసం ముంబై ఇండియన్స్ అర్జున్ను సెలెక్ట్ చేయగా..నెపోటిజం అంటూ అర్జున్ను ట్రోల్ చేశారు నెటిజన్స్. దీంతో అర్జున్‌కు మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేశాడు ఫర్హాన్. తాను, అర్జున్ […]
దిశ, సినిమా: పొలిటికల్ అండ్ సోషల్ ఇష్యూస్‌పై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండుల్కర్‌పై వస్తున్న ట్రోలింగ్స్‌పై తన ఒపీనియన్ చెప్పారు. ఐపీఎల్ – 2021 టీ-20 సిరీస్ కోసం ముంబై ఇండియన్స్ అర్జున్ను సెలెక్ట్ చేయగా..నెపోటిజం అంటూ అర్జున్ను ట్రోల్ చేశారు నెటిజన్స్. దీంతో అర్జున్‌కు మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేశాడు ఫర్హాన్.
తాను, అర్జున్ ఒకే జిమ్‌కు వెళ్తామని, యువ క్రికెటర్‌గా ఫిట్నెస్ గురించి ఎంత కష్టపడుతున్నాడో తనకు తెలుసన్నారు. బెస్ట్ క్రికెటర్ అనిపించుకునేందుకు అతను పడే తాపత్రయం చూశానన్న ఫర్హాన్..అలాంటి వ్యక్తిపై నెపోటిజం అనే ముద్ర వేయడం అన్యాయం, క్రూరం అని చెప్పాడు. ఆదిలోనే తన ఉత్సాహాన్ని మర్డర్ చేయొద్దని, ఇలాంటి బరువులు మోపి కుంగదీయకూడదని కోరాడు. ఫర్హాన్ గర్ల్ ఫ్రెండ్ శిబానీ దండేకర్ కూడా..అర్జున్‌కు సపోర్ట్ చేస్తూ ఫర్హాన్ ట్వీట్‌ను రీట్వీట్ చేసింది.
I feel I should say this about #Arjun_Tendulkar. We frequent the same gym & I’ve seen how hard he works on his fitness, seen his focus to be a better cricketer. To throw the word ‘nepotism’ at him is unfair & cruel. Don’t murder his enthusiasm & weigh him down before he’s begun.
— Farhan Akhtar (@FarOutAkhtar) February 20, 2021