సుశాంత్‌ది.. హత్యా? ఆత్మహత్యా?
జూన్ 14, ఆదివారం.. ఎవరూ ఊహించని వార్త.. అభిమానులను అయోమయంతో పాటు కలవరానికి గురిచేసింది. ఇది నిజం కాకపోతే బాగుండని చాలామందే కోరుకున్నారు. కానీ అక్షరాల ఆ వార్తే నిజమైంది. ఎంతో మంది అభిమానులను శోక సంద్రంలోకి నెట్టి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కన్నుమూశారు. పైగా అతడు ఆత్మహత్యకు పాల్పడటం అభిమానుల గుండెల్ని కలిచివేసింది. సుశాంత్ అలా చేసి ఉండడు.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? బ్రిలియంట్ స్టూడెంట్.. టాలెంటెడ్ యాక్టర్.. ప్రతీది పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటూ జీవితంలో […]
జూన్ 14, ఆదివారం.. ఎవరూ ఊహించని వార్త.. అభిమానులను అయోమయంతో పాటు కలవరానికి గురిచేసింది. ఇది నిజం కాకపోతే బాగుండని చాలామందే కోరుకున్నారు. కానీ అక్షరాల ఆ వార్తే నిజమైంది. ఎంతో మంది అభిమానులను శోక సంద్రంలోకి నెట్టి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కన్నుమూశారు. పైగా అతడు ఆత్మహత్యకు పాల్పడటం అభిమానుల గుండెల్ని కలిచివేసింది.
సుశాంత్ అలా చేసి ఉండడు.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? బ్రిలియంట్ స్టూడెంట్.. టాలెంటెడ్ యాక్టర్.. ప్రతీది పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటూ జీవితంలో ఎన్నో సాధించాలని కలలు కన్న సుశాంత్ ఉరేసుకుని చనిపోయాడా? అసలు ఏం జరిగి ఉంటుంది? ఈ ఆలోచనలు అభిమానుల మెదళ్లను తొలిచివేశాయి. తండ్రి, కుటుంబీకులు, స్నేహితులు సుశాంత్‌ది ఆత్మహత్య కాదు, హత్య అని ఆరోపించారు. దీనిపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు.. ఫ్రెండ్స్‌తో పాటు లవర్ రియా చక్రవర్తిని విచారించారు. ఆయన డైరీలు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఘటన జరిగి పది రోజులు కావస్తున్నా అసలు ఏం జరిగిందో చెప్పలేకపోయారు.
కొందరు ఇలా..?
బాలీవుడ్‌లో పెరిగిపోయిన నెపోటిజం వల్లే సుశాంత్ చనిపోయాడని అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. తను కమిట్ అయిన ఏడు సినిమాల్లో ఆరు ప్రాజెక్టులు ఆగిపోవడం.. కొన్ని నిర్మాణ సంస్థలు తనను బ్యాన్ చేయడంతో తను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెపోటిజం గురించి మాట్లాడిన సుశాంత్‌పై బాలీవుడ్ ప్రముఖులతో పాటు తమకు చెంచాల్లా వ్యవహరించే కొన్ని మీడియా సంస్థలు కూడా తనపై కుట్ర చేశాయని.. తనను తప్పుడు మనిషిగా చూపించే ప్రయత్నం చేశాయని ఆరోపిస్తున్నారు. ఇవన్నీ తట్టుకోలేక సుశాంత్ చనిపోయి ఉంటాడని చెప్తున్నారు.
ఇప్పుడు కూడా తూ.. తూ మంత్రంగా విచారణ జరిపి, కేస్ క్లోజ్ చేస్తామనే ప్లాన్‌లో పోలీసులున్నారని చెప్తోన్న అభిమానులు.. ఆందోళనకు దిగారు. ఇది వెల్ ప్లాన్డ్ మర్డర్ అని.. 302 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
మరి కొందరు అలా?
ఒకవేళ సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటే తన మెడపై ఉన్న గాయాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. నిజంగా సుశాంత్ ఉరేసుకుని ఉంటే.. తన కళ్లు, నాలుక, కాళ్లు మరోలా ఉండేవని చెప్తున్నారు. నిజానికి సుశాంత్ తన రూమ్‌లో ఉరేసుకునే ఛాన్సే లేదంటున్నారు. ఆరడుగుల సుశాంత్.. నాలుగు అడుగుల ఎత్తులో ఉన్న ఫ్యాన్‌కు ఎలా ఉరేసుకుని చనిపోతాడని? ప్రశ్నిస్తున్నారు. సుశాంత్‌ది ముమ్మాటికీ మర్డర్ అని.. ఇందులో ప్రియురాలు రియా చక్రవర్తి, ముఖేష్ భట్ ప్రధాన పాత్రధారులని ఆరోపిస్తూ.. విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
స్నేహితులు చెప్తోంది..
సుశాంత్ సింగ్ క్యారెక్టర్‌ను దెబ్బ తీసేందుకు కొందరు తన మరణాన్ని వాడుకుంటున్నారని అంటున్నారు స్నేహితులు. నిజానికి సుశాంత్ ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని.. తనకు ఇన్ని పాలిటిక్స్ పట్టించుకునే టైమ్ కూడా లేదని చెప్తున్నారు. బుక్స్, రీసెర్చ్, వ్యవసాయంతో చాలా బిజీగా ఉండేవాడని కొందరు స్నేహితులు చెప్తుంటే.. తన ఫస్ట్ లవ్ అంకిత లోఖండే తనతో ఉండి ఉంటే చనిపోయే వాడుకాదని మరికొందరంటున్నారు. తనతో ఉండి ఉంటే తల్లి లేదన్న బాధ, డిప్రెషన్ అనేది తన దరికి రాకుండా ఉండేదని అంటున్నారు.
https://twitter.com/filmfare/status/1275298637518712832?s=19