‘ముందు జాదవ్‌ను తీసేయండి’
దిశ, స్పోర్ట్స్ : మూడు సార్లు ఐపీఎల్ విజేత, గత సీజన్ రన్నరప్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న 13వ సీజన్‌లో ప్రదర్శన పేలవంగా ఉన్నది. మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోని కూడా జట్టును గెలిపించలేకపోతున్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ధోని కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అతడికంటే ఎక్కువగా కేదార్ జాదవ్‌పైనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. చివరి మూడు ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన దశలో […]
దిశ, స్పోర్ట్స్ : మూడు సార్లు ఐపీఎల్ విజేత, గత సీజన్ రన్నరప్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న 13వ సీజన్‌లో ప్రదర్శన పేలవంగా ఉన్నది. మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోని కూడా జట్టును గెలిపించలేకపోతున్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ధోని కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అతడికంటే ఎక్కువగా కేదార్ జాదవ్‌పైనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. చివరి మూడు ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన దశలో చెన్నై బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. కేదార్ జాదవ్ డిఫెన్స్ ఆడుతూ బంతులు వృధా చేయడంతో 10 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. దీంతో ఫాన్స్ అతడిపై మండిపడుతున్నారు. జాదవ్‌ను జట్టు నుంచి తొలగించాలని ఏకంగా ఆన్‌లైన్ సంతకాల ఉద్యమం ప్రారంభించారు. 15 వేల మంది సంతకాలు చేసేలా రూపొందించిన ఈ పిటిషన్‌పై ఇప్పటికే 14వేల మంది సంతకాలు చేశారు. ఈ పిటిషన్‌ను ధోనికి పంపనున్నట్లు దానిలో పేర్కొన్నారు. కోల్‌కతాపై ఓడిపోవడానికి జాదవే కారణమని అతడిని జట్టు నుంచి తొలగించమని అందులో పేర్కొన్నారు.