Fake News.. ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!

దిశ, వెబ్‌డెస్క్: వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు విధించిన పెండింగ్‌ చలాన్లపై.. అక్టోబర్‌ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దసరా ఆఫర్ (50 శాతం డిస్కౌంట్) నడుస్తోంది.. అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన హల్‌చల్ చేస్తోంది. హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో నిర్వహించే ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ద్వారా పెండింగ్‌ చలాన్లు క్లియర్ చేసుకోవాలని ఈ ప్రకటన సారాంశం. ఇది చూసిన వాహనదారులు ఒక్కసారిగా సంతోషపడ్డారు. అధికారికంగా ట్రాఫిక్ అధికారుల నుంచి ఎటువంటి ప్రకటన రాకపోయినా.. […]

Update: 2021-09-03 21:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు విధించిన పెండింగ్‌ చలాన్లపై.. అక్టోబర్‌ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దసరా ఆఫర్ (50 శాతం డిస్కౌంట్) నడుస్తోంది.. అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన హల్‌చల్ చేస్తోంది. హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో నిర్వహించే ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ద్వారా పెండింగ్‌ చలాన్లు క్లియర్ చేసుకోవాలని ఈ ప్రకటన సారాంశం. ఇది చూసిన వాహనదారులు ఒక్కసారిగా సంతోషపడ్డారు. అధికారికంగా ట్రాఫిక్ అధికారుల నుంచి ఎటువంటి ప్రకటన రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ వార్తను ఖండించారు పోలీసులు.

హైదరాబాద్ పోలీసుల క్లారిటీ..

ఇక పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకునేందుకు మంచి అవకాశం వచ్చిందనుకునేలోపు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు. వచ్చే నెల దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ లేదని బాంబు పేల్చారు. పెండింగ్‌ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్ ఫేక్ అంటూ కొట్టిపడేశారు. అంతేకాకుండా ఇటువంటి ఫేక్ పోస్టు క్రియేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ ఫేక్ ప్రకటనను సోషల్ మీడియాలో ఫార్వర్డ్, ప్రమోషన్ చేసిన వారిని కూడా ఉపేక్షించేది లేదన్నారు. ఈ వార్త విన్న వాహనదారులు తీవ్ర నిరుత్సాహానికి లోనయినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, పలువురు నెటిజన్లు ఈ న్యూస్‌ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడంతో నగరవాసులకు తప్పుడు సమాచారం వెళ్తోందని.. ఇటువంటి ఫేక్ ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదివరకే ఇటువంటి నకిలీ ప్రకటనను నమ్మిన వాహనదారులు గోషామహల్ స్టేడియానికి పరుగులు పెట్టారు. తీరా ఫేక్ అని చెప్పడంతో వెనుదిరిగారు.

Tags:    

Similar News