ఏపీలో నకిలీ చలానాల కుంభకోణం..

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో నకిలీ చలానాల కుంభకోణం కలకలం రేపుతోంది. సబ్ రిజిస్ట్రార్లు కిందిస్థాయిలోని డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెరలేపారు. ఈ కుంభకోణంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడూతూ ఈ ఏడాది మార్చి 20 నుంచి జరిగిన లావాదేవీలపై విచారణ చేపడతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చలానాలను తాము తనీఖీ చేశామని చెప్పారు. తొమ్మిది […]

Update: 2021-08-14 04:57 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో నకిలీ చలానాల కుంభకోణం కలకలం రేపుతోంది. సబ్ రిజిస్ట్రార్లు కిందిస్థాయిలోని డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెరలేపారు. ఈ కుంభకోణంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడూతూ ఈ ఏడాది మార్చి 20 నుంచి జరిగిన లావాదేవీలపై విచారణ చేపడతున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చలానాలను తాము తనీఖీ చేశామని చెప్పారు. తొమ్మిది జిల్లాల్లో ఈ కుంభకోణం వెలుగులోకి రాగా అత్యధికంగా కృష్ణా, కడప జిల్లాల్లోనే కేసులు నమోదైనట్లు తెలిపారు. కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధిక మోసాలు జరిగినట్టు నిర్ధారించామన్నారు. ఈ కుంభకోణంలో 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా.. ఆరుగురు సబ్‌ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.5.40 కోట్ల విలువైన నకిలీ చలానాలను గుర్తించగా.. 770 డాక్యుమెంట్లలో భారీ మోసాలు జరిగాయని గుర్తించామన్నారు. ఇప్పటి వరకు రూ.1.37 కోట్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు.

చలానాలు కట్టారో లేదో విచారణలో తేలుతుందని.. కొనుగోలుదారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కుంభకోణంపై సీఐడీ విచారణ అవసరంలేదని, పోలీసు కేసు సరిపోతుందన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అక్రమాలకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని.. అక్రమార్కులు ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని రజత్ భార్గవ హెచ్చరించారు.

Tags:    

Similar News