లైక్ బటన్‌కు స్వస్తి పలకనున్న ఫేస్‌బుక్?

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో ఏదన్నా ఫొటో గానీ, పోస్టు గానీ పెట్టగానే ఎన్ని లైకులు వచ్చాయా? అని నిమిషానికోసారి చెక్ చేసేవారు చాలా మందే ఉంటారు. అంతెందుకు.. ఫేస్‌బుక్‌లో పాపులారిటీని లైకులు, కామెంట్లు, షేర్ల ద్వారానే అంచనా వేస్తారు. అలాంటి లైక్ బటన్‌కు ఫేస్‌బుక్ స్వస్తి పలకబోతోందని వార్తలొస్తున్నాయి. అయితే ఆ వార్తలు నిజమే.. కానీ పోస్టుల కింద వచ్చే లైక్ బటన్ కాదు, వేరే లైక్ బటన్‌ను ఫేస్‌బుక్ తొలగించబోతోంది. ఫేస్‌బుక్‌లో పేజీలు ఉంటాయి […]

Update: 2020-07-23 05:27 GMT

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో ఏదన్నా ఫొటో గానీ, పోస్టు గానీ పెట్టగానే ఎన్ని లైకులు వచ్చాయా? అని నిమిషానికోసారి చెక్ చేసేవారు చాలా మందే ఉంటారు. అంతెందుకు.. ఫేస్‌బుక్‌లో పాపులారిటీని లైకులు, కామెంట్లు, షేర్ల ద్వారానే అంచనా వేస్తారు. అలాంటి లైక్ బటన్‌కు ఫేస్‌బుక్ స్వస్తి పలకబోతోందని వార్తలొస్తున్నాయి. అయితే ఆ వార్తలు నిజమే.. కానీ పోస్టుల కింద వచ్చే లైక్ బటన్ కాదు, వేరే లైక్ బటన్‌ను ఫేస్‌బుక్ తొలగించబోతోంది. ఫేస్‌బుక్‌లో పేజీలు ఉంటాయి కదా.. ఆ పేజీల పాపులారిటీని కూడా లైకుల ద్వారానే అంచనా వేస్తారు. అయితే ఫేస్‌బుక్ పేజీలకు ఫాలో అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే ఈ లైక్, ఫాలో రెండూ బటన్లు దాదాపు ఒకే రకమైన విధిని నిర్వహిస్తున్నాయి. అందుకే ఇప్పుడు లైక్ బటన్‌ను తొలగించి, ఫాలో బటన్‌ను పర్మినెంట్ చేయాలని ఫేస్‌బుక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన డిజైన్‌ను ఫేస్‌బుక్ ఇప్పటికే ప్రయోగాత్మకంగా విడుదల చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి కొంతమంది ప్రముఖుల పేజీలకు మాత్రమే ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. త్వరలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న పేజీలకు కూడా లైక్ బటన్ తీసేసి తర్వాత అన్ని పేజీలకు అందుబాటులోకి తీసుకురానుంది. పేజీల సంక్లిష్టతను తగ్గించి, వినియోగదారుని అనుభూతిని మరింత సరళం చేసే ఉద్దేశంతోనే ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త డిజైన్‌లో లైక్ బటన్ తీసేయడం ద్వారా పేజీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం స్పష్టంగా కనిపించేలా అడ్జస్ట్ చేసే అవకాశం కూడా కలిగిందని ఉపయోగించిన కొంతమంది అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News