సేవలు బంద్.. స్పందించిన వాట్సప్, ఫేస్ బుక్ యాజమాన్యం

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఒక్కసారిగా వాట్సప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అసలు ఏమైందో తెలియక యూజర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో దీనిపై ఎట్టకేలకు వాట్సప్, ఫేస్ బుక్ సంస్థలు ట్విట్టర్‌లో స్పందించాయి. ‘కొంతమంది వ్యక్తులు వాట్సప్ ను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారని మాకు తెలుసు. సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాం’ అని వాట్సప్ తన అధికారిక […]

Update: 2021-10-04 10:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఒక్కసారిగా వాట్సప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అసలు ఏమైందో తెలియక యూజర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో దీనిపై ఎట్టకేలకు వాట్సప్, ఫేస్ బుక్ సంస్థలు ట్విట్టర్‌లో స్పందించాయి. ‘కొంతమంది వ్యక్తులు వాట్సప్ ను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారని మాకు తెలుసు. సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాం’ అని వాట్సప్ తన అధికారిక ట్విట్టర్‌లో అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టింది.

ఇక ఫేస్ బుక్ కూడా తన అధికారిక ఫేస్ బుక్ యాప్ ట్విట్టర్‌ అకౌంట్‌లో సేవలు నిలిచిపోవడంపై స్పందించింది. ‘ఫేస్ బుక్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిసింది. సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అసౌకర్యానికి క్షమాపణలు’ అని ట్విట్టర్‌లో పేర్కొంది.

Tags:    

Similar News