మెసెంజర్‌లో.. ఏఆర్ గ్రూప్ ఎఫెక్ట్స్
దిశ, ఫీచర్స్ : మెసెంజర్‌లో వీడియో కాల్, మెసెంజర్ రూమ్స్ కోసం ఫేస్‌బుక్.. కొత్త గ్రూప్ ఎఫెక్ట్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌లో ఏఆర్ ఫిల్టర్స్, ఇతర ఎఫెక్ట్‌లను పరిచయం చేస్తుండగా, వీటిని ఒకే సమయంలో వీడియో కాల్‌లోని ప్రతి ఒక్కరికీ వర్తింపజేయవచ్చు. ‘గ్రూప్ ఎఫెక్ట్ ఫీచర్’ ప్రస్తుతం మెసెంజర్‌లో ఇంట్రడ్యూస్ కాగా.. త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో రోల్ అవుతుందని ఫేస్‌బుక్ ధృవీకరించింది. వీడియో కాల్‌లో యూజర్లందరికీ గ్రూప్ ఎఫెక్ట్స్ పనిచేస్తాయని, ఇది ఇప్పటికే అందుబాటులోకి వచ్చినప్పటికీ […]
దిశ, ఫీచర్స్ : మెసెంజర్‌లో వీడియో కాల్, మెసెంజర్ రూమ్స్ కోసం ఫేస్‌బుక్.. కొత్త గ్రూప్ ఎఫెక్ట్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌లో ఏఆర్ ఫిల్టర్స్, ఇతర ఎఫెక్ట్‌లను పరిచయం చేస్తుండగా, వీటిని ఒకే సమయంలో వీడియో కాల్‌లోని ప్రతి ఒక్కరికీ వర్తింపజేయవచ్చు.
‘గ్రూప్ ఎఫెక్ట్ ఫీచర్’ ప్రస్తుతం మెసెంజర్‌లో ఇంట్రడ్యూస్ కాగా.. త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో రోల్ అవుతుందని ఫేస్‌బుక్ ధృవీకరించింది. వీడియో కాల్‌లో యూజర్లందరికీ గ్రూప్ ఎఫెక్ట్స్ పనిచేస్తాయని, ఇది ఇప్పటికే అందుబాటులోకి వచ్చినప్పటికీ కొందరికి మాత్రం కొంత సమయం పట్టవచ్చని తెలిపింది. ఆడుకునేందుకు వీలుగా మల్టీప్లేయర్ గేమింగ్ అనుభవాలను కూడా కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. మొత్తంగా 70 కొత్త గ్రూప్ ఎఫెక్ట్స్ పొందనుండగా.. ఫేస్‌బుక్ ఇప్పటికే స్టోరీలు, రీల్స్‌ను రూపొందించడానికి AR ఎఫెక్ట్‌లతో వస్తోంది. ఇప్పుడు వీడియో కాల్స్, రూమ్స్‌లో కూడా ఈ అదనపు సామర్థ్యాలను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ మీకు వచ్చిందో రాలేదో అని తెలుసుకునేందుకు Facebook Messenger యాప్‌ను తెరిచి వీడియో కాల్‌ను ప్రారంభించవచ్చు లేదా రూమ్‌ను క్రియేట్ చేయొచ్చు. రూమ్ క్రియేట్ చేసిన తర్వాత స్మైలీ ఫేస్‌పై ప్రెస్ చేసి, ఎఫెక్ట్స్ ట్రేను తెరవాలి. తర్వాత గ్రూప్ ఎఫెక్ట్స్ ఎంపిక కోసం చెక్ చేయొచ్చు. గ్రూప్ ఎఫెక్ట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో కాల్‌లోని పార్టిసిపెంట్స్‌కు ఆప్షన్స్ అప్లయ్ చేయొచ్చు.
రీకాల్ చేయడానికి ఎఫ్‌బీ, ఇన్‌స్టా.. ఇటీవల క్రాస్-యాప్ గ్రూప్ కమ్యూనికేషన్, కొత్త గ్రూప్ టైపింగ్ సూచికలను పొందాయి. క్రాస్-యాప్ గ్రూప్ చాట్ ఫీచర్ యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ మెసెంజర్ కాంటాక్ట్‌లను ఇంటిగ్రేట్ చేసేటప్పుడు గ్రూప్ చాట్స్ ప్రారంభించేందుకు అనుమతిస్తుంది. గ్రూప్ టైపింగ్ ఇండికేటర్స్‌తో యూజర్లు.. మల్టిపుల్ పర్సన్స్ టైప్ చేస్తున్నప్పుడు చూడొచ్చు.