వాహన పన్ను చెల్లింపు తేదీ మళ్లీ పొడిగింపు

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో వాణిజ్య వాహనాల త్రైమాసిక మోటార్ వెహికిల్(ఎంవీ) పన్ను చెల్లింపు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికం, సెప్టెంబర్‌తో ముగిసే మూడో త్రైమాసికాల అడ్వాన్స్ ఎంవీ పన్ను ఈనెల 31వ తేదీ దాకా ఎలాంటి పెనాల్టీ లేకుండా చెల్లించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా తొలుత జూన్ త్రైమాసికం పన్ను చెల్లింపు తేదీని పొడిగిస్తూ […]

Update: 2020-08-06 10:24 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో వాణిజ్య వాహనాల త్రైమాసిక మోటార్ వెహికిల్(ఎంవీ) పన్ను చెల్లింపు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికం, సెప్టెంబర్‌తో ముగిసే మూడో త్రైమాసికాల అడ్వాన్స్ ఎంవీ పన్ను ఈనెల 31వ తేదీ దాకా ఎలాంటి పెనాల్టీ లేకుండా చెల్లించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా లాక్‌డౌన్ కారణంగా తొలుత జూన్ త్రైమాసికం పన్ను చెల్లింపు తేదీని పొడిగిస్తూ వచ్చామని, ప్రస్తుతం సెప్టెంబర్ త్రైమాసికం పన్ను చెల్లింపు తేదీని సైతం పొడిగించామని జీవోలో పేర్కొన్నారు. నిజానికి రవాణా పన్ను రద్దు కోసం వాణిజ్య వాహనదారులు చాల రోజులుగా కోరుతుండగా ఈ విషయాన్ని ఎటూ తేల్చని ప్రభుత్వం పన్ను చెల్లింపు గడువును మాత్రం పొడిగిస్తూ వస్తోంది. వాణిజ్య వాహనాలకు ప్రతి త్రైమాసికానికిగాను ఆ క్వార్టర్‌లో మొదటి నెల ముగిసేలోపు ముందస్తుగా ఎంవీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News