కాంట్రాక్టు వైద్యుల పదవీకాలం పొడగింపు

దిశ, తెలంగాణ బ్యూరో : పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న 75 మంది కాంట్రాక్ట్ వైద్యుల పదవీకాలాన్ని మరో ఏడాది పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సంబంధిత వైద్యులకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పశుసంవర్ధకశాఖలో కాంట్రాక్టు వైద్యుల సేవలు అవసరం అని భావించి […]

Update: 2021-05-07 08:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న 75 మంది కాంట్రాక్ట్ వైద్యుల పదవీకాలాన్ని మరో ఏడాది పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సంబంధిత వైద్యులకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పశుసంవర్ధకశాఖలో కాంట్రాక్టు వైద్యుల సేవలు అవసరం అని భావించి పదవికాలం పొడిగించామని తెలిపారు.

విధుల్లో అలసత్వం వహించొద్దని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ రాంచందర్ పలువురికి వైద్యులకు ఉత్తర్వులు అందజేశారు. మిగిలిన వారికి ఆయా జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారుల ద్వారా అందజేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News