ఇగ్నో ప్రవేశాల గడువు ఈ నెల 11వ తేదీ వరకు పొడిగింపు
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) 2021 సంవత్సరం జూలై అడ్మిషన్ల గడువును పొడిగించినట్లు ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎస్ ఫయాజ్ అహ్మద్ శనివారం తెలిపారు. డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ ప్రోగ్రాములలో చేరడానికి చివరి తేదీని అక్టోబర్ 11వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ ప్రోగ్రాములలో ప్రవేశం పొందడానికి ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ విద్యార్థులకు పూర్తి ఫీజు […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) 2021 సంవత్సరం జూలై అడ్మిషన్ల గడువును పొడిగించినట్లు ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎస్ ఫయాజ్ అహ్మద్ శనివారం తెలిపారు. డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ ప్రోగ్రాములలో చేరడానికి చివరి తేదీని అక్టోబర్ 11వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ ప్రోగ్రాములలో ప్రవేశం పొందడానికి ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ విద్యార్థులకు పూర్తి ఫీజు మినహాయింపు ఉంటుందని, తెలంగాణ లోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నిర్ణీత గడువు లోగా ఆన్ లైన్ లో ఇగ్నో వెబ్ సైట్ www.ignou.ac.in ద్వారా అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు. మరిన్ని వివరాలుకు అభ్యర్థులు rchyderabad@ignou.ac.in మెయిల్ ద్వారా గానీ, 9492451812, 040-23117550 నెంబర్లలో సంప్రదించవచ్చని డాక్టర్ ఫయాజ్ అహ్మద్ పేర్కొన్నారు.