సంగారెడ్డి జిల్లాలో పేలుడు.. మహిళకు తీవ్ర గాయాలు

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం పేలుడు సంభవించింది. రాయికోడ్ చౌరాస్తా వద్ద ఓ ఇంటి ఆవరణంలో బర్మాపూస(బండలు పేల్చే పదార్థం) ప్రమాదవశాత్తు పేలింది. దీంతో ఓ మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని బర్మాలు పేల్చే వారికి గతంలో అద్దెకు ఇచ్చాడు. వారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో.. యజమానులు ఇవాళ ఉదయం ఇంటిని శుభ్రపరిచి చెత్తను ఇంటి ఆవరణంలో మంటలో కాల్చేందుకు […]

Update: 2020-06-03 05:25 GMT

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం పేలుడు సంభవించింది. రాయికోడ్ చౌరాస్తా వద్ద ఓ ఇంటి ఆవరణంలో బర్మాపూస(బండలు పేల్చే పదార్థం) ప్రమాదవశాత్తు పేలింది. దీంతో ఓ మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని బర్మాలు పేల్చే వారికి గతంలో అద్దెకు ఇచ్చాడు. వారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో.. యజమానులు ఇవాళ ఉదయం ఇంటిని శుభ్రపరిచి చెత్తను ఇంటి ఆవరణంలో మంటలో కాల్చేందుకు ప్రయత్నించారు. బర్మాపూస చెత్తలో ఉండటంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చెత్తను కాలుస్తున్న మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంటి ఆవరణలో వస్తువులు చెల్లాచెదురు అయ్యాయి. గాయపడిన మహిళను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడు శబ్దం నాలుగు కిలోమీటర్ల వరకూ వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News