బెంగాల్‌లో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం 11 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఇందులో ఐదుగురు దుర్మరణం చెందగా, దాదాపు పదిమంది గాయాలపాలయ్యారు. ఫ్యాక్టరీలోని భారీ యంత్రంలో సాంకేతి లోపం కారణంగా పేలుడు సంభవించినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు అధికారి అలోక్ రజోరియా తెలిపారు. ప్లాస్టిక్ తయారవుతుండగా ఈ పేలుడు జరిగిందని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు. మృతుల కుటుబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారాన్ని సీఎం మమతా […]
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం 11 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఇందులో ఐదుగురు దుర్మరణం చెందగా, దాదాపు పదిమంది గాయాలపాలయ్యారు. ఫ్యాక్టరీలోని భారీ యంత్రంలో సాంకేతి లోపం కారణంగా పేలుడు సంభవించినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు అధికారి అలోక్ రజోరియా తెలిపారు. ప్లాస్టిక్ తయారవుతుండగా ఈ పేలుడు జరిగిందని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు. మృతుల కుటుబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారాన్ని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.