బెల్టు షాపులపై సర్పంచ్ స్టేటస్.. బండబూతులు తిట్టిన ఎక్సైజ్ ఆఫీసర్

దిశ , పెద్దపల్లి: గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఎక్సైజ్ సీఐ గ్రామ సర్పంచ్ పై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్ సముద్రాల రమేష్ తమ ఊరిలో అక్రమ బెల్టుషాపులు.. ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నల్లో నిర్వహిస్తున్నారు అంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ సీఐ జి.గురువయ్య సర్పంచ్‌కు ఫోన్ చేశాడు. వెంటనే దాన్ని తొలగించాలని చెబుతూనే పరువు నష్టం దావా […]

Update: 2021-06-24 08:28 GMT

దిశ , పెద్దపల్లి: గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఎక్సైజ్ సీఐ గ్రామ సర్పంచ్ పై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్ సముద్రాల రమేష్ తమ ఊరిలో అక్రమ బెల్టుషాపులు.. ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నల్లో నిర్వహిస్తున్నారు అంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ సీఐ జి.గురువయ్య సర్పంచ్‌కు ఫోన్ చేశాడు. వెంటనే దాన్ని తొలగించాలని చెబుతూనే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ.. ముందు గ్రామంలో బెల్టు షాపులను తీసేయండి అని సర్పంచ్ రమేష్ బదులిచ్చాడు. ఇందుకు ఆగ్రహించిన గురువయ్య గ్రామ సర్పం‌చ్‌ను నానా బూతులు తిట్టిన ఆడియో టేప్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సీఐ స్థాయిలో ఉండి బూతుపురాణం ఏంటని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామ ప్రథమ పౌరుడినే ఇలా తిడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీఐ గురువయ్య వ్యాఖ్యలను జీర్ణించుకోలేని సర్పంచ్ రమేష్ అతడిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నాడు. బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలంటే ఇలా మాట్లాడటం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Tags:    

Similar News