పద్మావతి కోవిడ్సెంటర్ బాధితులకు పరిహారం
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి స్విమ్స్లోని పద్మావతి కోవిడ్ సెంటర్ నందు నిర్మాణంలో ఉన్న భవనం పెచ్చులూడి పడి ఓ అవుట్సోర్స్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు రోగులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతురాలు రాధిక, గాయపడిన ముని రాజా, నాగరత్నమ్మకు తక్షణమే పరిహారం అందించాలని అధికారులను కోరారు. నిర్మాణంలో ఉన్న భవనం నాణ్యతపై విచారణ చేపట్టాలని ఏపీహెచ్ఎంఐడీసీ ఎండీ […]
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి స్విమ్స్లోని పద్మావతి కోవిడ్ సెంటర్ నందు నిర్మాణంలో ఉన్న భవనం పెచ్చులూడి పడి ఓ అవుట్సోర్స్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు రోగులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే ఘటనపై విచారణకు ఆదేశించారు.
మృతురాలు రాధిక, గాయపడిన ముని రాజా, నాగరత్నమ్మకు తక్షణమే పరిహారం అందించాలని అధికారులను కోరారు. నిర్మాణంలో ఉన్న భవనం నాణ్యతపై విచారణ చేపట్టాలని ఏపీహెచ్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డిని మంత్రి ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న భవనాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మకు సూచించారు.