రామమందిర శంకుస్థాపన.. ఆయనను పిలవకపోతే అన్యాయమే

న్యూఢిల్లీ: రామమందిరంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర శంకుస్థాపన వేడుకకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను ఆహ్వానించకుంటే తీవ్ర అన్యాయం చేసినట్టే అవుతుందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ట్వీట్ చేశారు. రామ మందిర కల సాకారమవడానికి దోహదపరిచే తీర్పును ఇచ్చిన జస్టిస్ రంజన్ గొగోయ్‌ను వేడుక నిర్వాహకులు ఆహ్వానించాలని, లేదంటే అతనికి అన్యాయం చేసినట్టే తెలిపారు. రామ జన్మభూమి కోసం రథయాత్ర […]

Update: 2020-07-27 08:25 GMT

న్యూఢిల్లీ: రామమందిరంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర శంకుస్థాపన వేడుకకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను ఆహ్వానించకుంటే తీవ్ర అన్యాయం చేసినట్టే అవుతుందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ట్వీట్ చేశారు.

రామ మందిర కల సాకారమవడానికి దోహదపరిచే తీర్పును ఇచ్చిన జస్టిస్ రంజన్ గొగోయ్‌ను వేడుక నిర్వాహకులు ఆహ్వానించాలని, లేదంటే అతనికి అన్యాయం చేసినట్టే తెలిపారు. రామ జన్మభూమి కోసం రథయాత్ర చేసిన ఎల్‌కే అడ్వాణీని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు రామ మందిర ట్రస్టు సభ్యులు ఒకరు వెల్లడించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 5న జరిగే రామ మందిర శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరుకాబోతున్నారు.

Tags:    

Similar News