సీపీగా రాకేశ్ ఆస్థానా.. వ్యతిరేకించిన ఢిల్లీ ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీకి నూతన పోలీసు కమిషనర్‌గా రాకేశ్ ఆస్థానాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానించింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఆరుగురు ఆప్ ఎమ్మెల్యేలు ఆస్థానాపై విమర్శలు చేశారు. అస్తానా నియామకాన్ని వెనక్కి తీసుకుని మరో అధికారిని ఆయన స్థానంలో నియమించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం తీర్మానం చేసింది. డీజీపీ పోస్టుకు […]
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీకి నూతన పోలీసు కమిషనర్‌గా రాకేశ్ ఆస్థానాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానించింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఆరుగురు ఆప్ ఎమ్మెల్యేలు ఆస్థానాపై విమర్శలు చేశారు. అస్తానా నియామకాన్ని వెనక్కి తీసుకుని మరో అధికారిని ఆయన స్థానంలో నియమించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం తీర్మానం చేసింది.
డీజీపీ పోస్టుకు రిటైర్‌మెంట్‌కు కనీసం మరో ఆరు నెలల వ్యవధి ఉన్న అధికారులనే ఎంచుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ పోస్టు నుంచి తొలగించి, సీబీఐ డైరెక్టర్‌గా సరిపోని అధికారిని ఢిల్లీపై ఎందుకు రుద్దాలనుకుంటున్నదని ప్రభుత్వం ఆరోపించింది. ఆస్థానాను కేంద్రం దుర్వినియోగపరచుకునే అవకాశముందని, తన రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టించే ముప్పు ఉన్నదనే ఆందోళనలున్నాయని తెలిపింది. సాధారణంగా రాష్ట్రాలకు పోలీసు బాస్ డీజీపీ కాగా, ఢిల్లీకి పోలీసు కమిషనర్‌కే ఆ అధికారాలున్నాయి.