మార్కెట్లలో సామాజిక దూరం తప్పనిసరి
దిశ, మెదక్: మార్కెట్లలో అమ్మకం, కొనుగోలుదార్లు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేట సమీకృత మార్కెట్‌లోని వెజ్, నాన్ వెజ్, చేపల మార్కెట్‌ను ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మార్కెట్లలో సామాజిక దూరం పాటించేలా పోలీసులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని తెలిపారు. మీరేమైనా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అంటూ మటన్ […]
దిశ, మెదక్: మార్కెట్లలో అమ్మకం, కొనుగోలుదార్లు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేట సమీకృత మార్కెట్‌లోని వెజ్, నాన్ వెజ్, చేపల మార్కెట్‌ను ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మార్కెట్లలో సామాజిక దూరం పాటించేలా పోలీసులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని తెలిపారు. మీరేమైనా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అంటూ మటన్ షాపు నిర్వాహకులను ఆరాదీశారు. మటన్ షాపునకు వచ్చే వినియోగదారులు తమ వెంట స్టీల్ బాక్సు తెచ్చుకోవాలని సూచించారు.
Tags: minister harish rao, inspection, integrated markets, siddipet