లాక్‌డౌన్ పాటించాల్సిందే : సబితాఇంద్రారెడ్డి

దిశ, రంగారెడ్డి: కరోనా మహమ్మారి బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, లాక్‌డౌన్‌ నియమ నిబంధనలను ప్రజలు తప్పకుండా పాటించాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వైరస్ వ్యాప్తి నివారణకు పట్టణ వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేస్తున్నామని తెలిపారు. మొదట పట్టణ ప్రాంతాలు, ఆ తర్వాత గ్రామాల్లో స్ప్రే చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ విజ్ఞప్తికి ప్రజలంతా సహకరించి ఇంటి వద్దే ఉండాలని కోరారు. […]

Update: 2020-03-29 02:56 GMT

దిశ, రంగారెడ్డి: కరోనా మహమ్మారి బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, లాక్‌డౌన్‌ నియమ నిబంధనలను ప్రజలు తప్పకుండా పాటించాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వైరస్ వ్యాప్తి నివారణకు పట్టణ వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేస్తున్నామని తెలిపారు. మొదట పట్టణ ప్రాంతాలు, ఆ తర్వాత గ్రామాల్లో స్ప్రే చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ విజ్ఞప్తికి ప్రజలంతా సహకరించి ఇంటి వద్దే ఉండాలని కోరారు. ప్రతిరోజు ఉదయం వేళల్లో నిబంధనలను పాటిస్తూ నిత్యావసర వస్తువులను, కూరగాయలను తెచ్చుకోవాలని కోరారు. ప్రజలంతా ఎక్కడి వారు అక్కడే ఉండాలని, ప్రతి ఒక్కరి ఆకలిని ప్రభుత్వం తీరుస్తుందన్నారు. జిల్లాలోని ఇటుక బట్టీల కార్మికులకు నిత్యం భోజన సౌకర్యాన్ని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్య పడొద్దని హామీ ఇచ్చారు. కరోనా వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని స్పష్టం చేశారు.

TAGS : Everyone, follow, lockdown, SABITHA INDRA REDDY, CORONAVIRUS, RANGAREDDY

Tags:    

Similar News