అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.. తమిళిసై

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా మ‌హ‌మ్మారి ప్రబలకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌందరరాజన్ సూచించారు. సోమవారం రాజ్‌భ‌వ‌న్‌‌లో ఉన్నతాధికారుల‌తో పుదుచ్చేరి నుంచి వర్చువల్ పద్దతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుత కరోనా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీకా డ్రైవ్, లాక్‌డౌన్ స్టేటస్, టెస్టింగ్, రికవరీ రేట్, ఐసోలేషన్ తదితర అంశాలపై స‌మీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. స‌మ‌ష్టి కృషితో ఆరోగ్యవంత‌మైన రాష్ట్రాన్ని సాధించుకోగ‌లం అని చెప్పారు. కొవిడ్ చికిత్సలో 2-డీజీ […]

Update: 2021-05-17 11:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా మ‌హ‌మ్మారి ప్రబలకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌందరరాజన్ సూచించారు. సోమవారం రాజ్‌భ‌వ‌న్‌‌లో ఉన్నతాధికారుల‌తో పుదుచ్చేరి నుంచి వర్చువల్ పద్దతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుత కరోనా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీకా డ్రైవ్, లాక్‌డౌన్ స్టేటస్, టెస్టింగ్, రికవరీ రేట్, ఐసోలేషన్ తదితర అంశాలపై స‌మీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. స‌మ‌ష్టి కృషితో ఆరోగ్యవంత‌మైన రాష్ట్రాన్ని సాధించుకోగ‌లం అని చెప్పారు. కొవిడ్ చికిత్సలో 2-డీజీ ఔష‌ధం గేమ్ చేంజ‌ర్‌గా ప‌ని చేస్తుంద‌ని, ఈ ఔష‌ధం స‌త్ఫలితాలు ఇస్తుంద‌ని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాజ్ భవన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News