రేపు ప్రారంభంకానున్న 'ప్రతీ ఆదివారం- పది గంటలకు- పది నిమిషాలు'

దిశ, న్యూస్‌బ్యూరో: సీజనల్ వ్యాధుల నివారణకు ‘ప్రతీ ఆదివారం – పది గంటలకు- పదినిమిషాలు’ కార్యక్రమాన్ని రేపటి నుంచి నిర్వహించేందుకు పురపాలక శాఖ సిద్ధమవుతోన్నది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ రేపు (మే10 న) ప్రారంభించనున్నారు. ప్రజా ప్రతినిధులందర్నీ కలుపుకొని ముందుకు పోవాలని మున్సిపల్ కమిషనర్లను మంత్రి ఈ సందర్భంలో ఆదేశించారు. ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఇండ్లలో దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పన్ను చెల్లింపుదారులకు 5 శాతం రిబేట్ మే 31 […]

Update: 2020-05-09 09:24 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: సీజనల్ వ్యాధుల నివారణకు ‘ప్రతీ ఆదివారం – పది గంటలకు- పదినిమిషాలు’ కార్యక్రమాన్ని రేపటి నుంచి నిర్వహించేందుకు పురపాలక శాఖ సిద్ధమవుతోన్నది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ రేపు (మే10 న) ప్రారంభించనున్నారు. ప్రజా ప్రతినిధులందర్నీ కలుపుకొని ముందుకు పోవాలని మున్సిపల్ కమిషనర్లను మంత్రి ఈ సందర్భంలో ఆదేశించారు. ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఇండ్లలో దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

పన్ను చెల్లింపుదారులకు 5 శాతం రిబేట్

మే 31 లోపు ఆస్తి పన్ను చెల్లింపుదారులందరికీ 5 శాతం రిబేట్ వర్తింపజేస్తూ పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది. రూ. 30 వేల లోపు పన్ను ఉన్నవారికి మాత్రమే ఈ రిబేట్ వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అన్ని పట్టణాల్లో ఇది వర్తింపజేస్తున్నట్టు శాఖ తెలిపింది. రెసిడెన్షియల్, కమర్షియల్ క్యాటగిరిల్లోని అందరికీ ఈ ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకం వర్తిస్తోందని శాఖ స్పష్టం చేసింది.

Telangana, KCR, municipality, GHMC, Tax

Tags:    

Similar News