లోకల్ బ్రాండ్‌లను ప్రమోట్ చేద్దాం : మోదీ

దిశ, వెబ్‌డెస్క్: జాతినుద్దేశించి మంగళవారం ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో, భారతీయులందరూ స్థానిక ఉత్పత్తులను మాత్రమే వాడాలని పిలుపునిచ్చారు. స్థానిక వస్తువులను వాడటానికి గర్వపడాలని, దానికి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని తెలిపారు. ఖాదీ వస్తువులను కొంటే స్థానిక చేనేతకారులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటినుంచి ‘స్థానికం’ను మన జీవన మంత్రగా మార్చుకోవాల్సిన సమయమొచ్చిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా… ‘స్థానికమే మనల్ని కాపాడింది. ఇది మన బాధ్యత. స్థానికత అనే మాటను జీవన మంత్రగా మార్చుకోవాలని కాలం […]

Update: 2020-05-12 10:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: జాతినుద్దేశించి మంగళవారం ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో, భారతీయులందరూ స్థానిక ఉత్పత్తులను మాత్రమే వాడాలని పిలుపునిచ్చారు. స్థానిక వస్తువులను వాడటానికి గర్వపడాలని, దానికి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని తెలిపారు. ఖాదీ వస్తువులను కొంటే స్థానిక చేనేతకారులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటినుంచి ‘స్థానికం’ను మన జీవన మంత్రగా మార్చుకోవాల్సిన సమయమొచ్చిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా… ‘స్థానికమే మనల్ని కాపాడింది. ఇది మన బాధ్యత. స్థానికత అనే మాటను జీవన మంత్రగా మార్చుకోవాలని కాలం నేర్పిస్తోంది. ప్రస్తుతమున్న గ్లోబల్ బ్రాండ్స్ అన్నీ ఇంతకుముందు లోకల్ బ్రాండ్‌లే. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాటిని ఆదరించడం వల్లే గ్లోబల్‌గా మరాయి. ఇకనుంచి మనం కూడా స్థానిక వస్తువులను, ఉత్పత్తులను వాడాలి. వాటిని ప్రమోట్ చేసే బాధ్యత కూడా మనదే. ఇండియాలో వనరులకు కొదవలేదు. నాణ్యమైన ఉత్పత్తులతో సరఫరా వ్యవస్థను మెరుగుపరుచుకుందాం’ అని మోదీ తెలిపారు.

Tags:    

Similar News