ప్రైవేటు ఆసుపత్రుల్లో పైసలు పోసినా.. ప్రాణాలు దక్కుతలేవు..
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రైవేట్ ఆసుపత్రులున్న జిల్లా రంగారెడ్డి. ఈ జిల్లాలో సుమారుగా వెయ్యికి పైగానే ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రులున్నాయి. అయితే అధికారికంగా 130 ఆసుపత్రుల్లోనే కరోనా చికిత్స నడుస్తోందని అధికారులు, ప్రజాప్రతినిధులు వివరిస్తున్నారు. కానీ జిల్లాలో అత్యధిక ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు చేస్తున్నారు. అయితే మరికొన్ని ఆసుపత్రులు వైద్యులు లేకుండా వారి సలహాలతో నర్సులను ఏర్పాటు చేసి కరోనా వైరస్ నిర్మూలన చికిత్సలు చేస్తున్నారు. దీంతో వారం రోజులుగా చికిత్స పొందుతున్న […]
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రైవేట్ ఆసుపత్రులున్న జిల్లా రంగారెడ్డి. ఈ జిల్లాలో సుమారుగా వెయ్యికి పైగానే ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రులున్నాయి. అయితే అధికారికంగా 130 ఆసుపత్రుల్లోనే కరోనా చికిత్స నడుస్తోందని అధికారులు, ప్రజాప్రతినిధులు వివరిస్తున్నారు. కానీ జిల్లాలో అత్యధిక ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు చేస్తున్నారు. అయితే మరికొన్ని ఆసుపత్రులు వైద్యులు లేకుండా వారి సలహాలతో నర్సులను ఏర్పాటు చేసి కరోనా వైరస్ నిర్మూలన చికిత్సలు చేస్తున్నారు. దీంతో వారం రోజులుగా చికిత్స పొందుతున్న రోగులు లక్షలు చెల్లించి ప్రాణాలు కొల్పోతున్నారు. అయినప్పటికి డెడ్‌బాడీ ఇవ్వాలంటే అదనపు నగదు చెల్లించాలి.
లేకపోతే డెడ్‌బాడీ ఇవ్వలేమని ఆసుపత్రి యాజమాన్యులు సామాన్య ప్రజలను పిడించుకు తింటున్నాయి. కనీస మానవత్వం మరిచి.. కర్కషంగా వ్యవహారిస్తూ కరోనా చికిత్సను ఆసరగా చేసుకొని వ్యాపారం సాగిస్తున్నారు. ఇలాంటి దుస్ధితి రంగారెడ్డి జిల్లాలో ఇష్టారాజ్యంగా నడుస్తుంది. జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఒక వేళ ఫోన్ లిఫ్ట్ చేస్తే జిల్లా వైద్యాధికారి సమాధానం ఆ ఆసుపత్రులు మంత్రులు, ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధించినవి, మనమం చేబితే వినరనే విషయాన్ని బహటంగా తెలుస్తోంది. ఈవిధంగా వైద్యాధికారి ప్రవర్తించడంతో ప్రజలకు న్యాయం జరిగేది ఏలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నల్లగొండ జిల్లా నెరడిగొమ్మ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బి.పద్మయ్య కరోనా వైరస్ సోకి ఊపిరితిత్తుల వ్యాధితో ఈనెల 3వ తేదీన బీఎన్ రెడ్డిలోని మాక్సిక్యూర్ ఆసుప్రతిలో చేరారు. అయితే పది రోజుల తర్వాత అంటే ఈనెల 13వ తేదీన పద్మయ్య(41) ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే వారు ఆసుపత్రిలో ఆడ్మిట్ అయిన రోజు రూ.2,80,000 ఆడ్వాన్స్‌గా చెల్లించారు. చనిపోయిన తర్వాత డెడ్‌బాడీ ఇవ్వాలంటే రూ.7,00,000 చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. ఈవిషయాన్ని జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేస్తే స్పందిచకపోవడంతో ఉన్నతాధికారి శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాల్సి వచ్చిందని బాధిత కుటుంబం వివరిస్తుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన ఎర్పుల శంకరయ్య కరోనా వైరస్‌తో ఊపిరి తీసుకొవడం కష్టంగా మారింది. దీంతో జిల్లా పరిధిలో బీఎన్ రెడ్డిలోని బృంగి ఆసుపత్రిలో చేరారు. ఎర్పుల శంకరయ్య రోజు కూలీ చేసుకొని జీవిస్తాడు. అతని కుటుంబం ఆయనను కాపాడుకునేందుకు ఎక్కడ బెడ్లు లేవని తెలియడంతో ఓ ఆర్ఎంపీ సలహాతో ఈ ఆసుపత్రిలో చేర్చారు. తక్షణమే రూ.40వేలు చెల్లించాలని చెప్పడంతో చెల్లించారు. కానీ నర్సులు తప్పా ఒక్క డాక్టర్ లేరు ఆ ఆసుపత్రిలో.. ట్రీట్మెంట్ అంతా వాట్సప్ ద్వారానే సాగుతుంది. ఈ విషయం జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేశారు. ఎప్పటికీ స్పందించకపోవడంతో మరుసటి రోజే డిశ్చార్జీ చేసుకొని మరో ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. బృంగి ఆసుపత్రికి ప్రభుత్వ అనుమతి ఉందా… లేదా తెలియదు.. అక్కడ బాధ్యతకలిగిన వ్యక్తులు లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఒక్క రోజు చికిత్సకే రూ.70వేలు వసూళ్ళు చేశారు. ప్రాణప్రాయస్థితిలోనున్న వ్యక్తులను కాపాడటంలో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
కమిషన్ల కమీట్మెంట్‌తోనే నిర్లక్ష్యం…
ప్రస్తుత పరిస్థితిలో సామాన్యులు ఇబ్బందులు చేప్పుకునేందుకు సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. వైద్యాధికారి కార్యాలయం వెళ్లిన అందుబాటులో ఉండరు. ఇలాంటి దమనీయమైన పరిస్థితిలో రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు తమకేమి పట్టనట్ల వ్యవహరిస్తన్నారు. ఇటీవల కాలంలో జిల్లా బీజేపీ నాయకులు వైద్యాధికారి కార్యాలయంను సైతం ముట్టడి చేసి ధర్నా చేశారు. జిల్లా వైద్యాధికారి ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో కుమ్మక్కై కమీషన్ల కోసం కక్కుర్తి పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వైద్యాధికారి వద్ద వ్యాక్సినేషన్, టీకాలు వేసిన, ఫీవర్ సర్వేపై నిర్ధిష్టమైన సమాచారం లేదనే విమర్శలున్నాయి. ఆ అధికారికి ఫోన్ చేసి ఏ సమాచారం అడగాలన్న ఫోన్ లిఫ్ట్ చేయదనే పేరోంది. ఈ నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించే అధికారికి ఎవరి బలం ఉందనే చర్చ సాగుతుంది. కరోనా వైరస్ మహమ్మారితో పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను నమ్ముకొని ఉన్నారు. ఏ ప్రభుత్వ ఆసుపత్రిని ఇప్పటి వరకు సందర్శించి అక్కడి సమస్యలు పరిష్కరించిన పాపన పోలేదు. వైరస్ విజృంభన సమయంలో ఎంతో అలర్ట్గా ఉండి పనిచేయాల్సిన వైద్యాధికారులే నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తే ప్రజల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.
నిబంధనలను విరుద్దంగా ప్రైవేట్ ఆసుపత్రులు…
–ప్రేమ్‌కుమార్, ఏఐఎస్ఎఫ్ సిటీ మాజీ ప్రెసిడెంట్
ప్రైవేట్ ఆసుపత్రిలు డబ్బే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. కానీ ప్రభుత్వ నిబంధనలు పాటించిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్వో అధికారులు కనీసం నిఘా పెట్టడం లేదు. హాస్పిటల్స్ అడ్డగోలు వ్యవహారం పైన కనీసం నియంత్రణ కూడా లేకపోవడం చాలా బాధాకరం. ఏదైనా సమస్య పైన ఫిర్యాదు చేయాలంటే డిఎంహెచ్వో స్వరాజ్య లక్ష్మి ఎవరికీ అందుబాటులోకి రారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందన కరువు. ఇలాంటి అధికారులు ఉండబట్టే ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టానుసారంగా దోపిడి సాగిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే అధికారులను తొలగించి ప్రజల పట్ల, సమాజం పట్ల, కనీస బాధ్యత ఉన్నటువంటి అధికారులను నియమించాలి. బీఎన్ రెడ్డి మాక్స్క్యూర్ ఆసుపత్రి వ్యవహారంపై ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్పందించ లేదు. ప్రాణం పోయిన శవంతో రాజకీయాలు చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు స్పందన లేకపోవడం దారుణం. ప్రైవేట్ ఆస్పత్రుల పైన నియంత్రణ కొనసాగించాలని ప్రజలను వారి యొక్క దోపిడి నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారం పై న విచారణ జరిపి హాస్పిటల్ చైర్మన్ రంజిత్ రెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతున్నాము.