బిడ్డ పుట్టగానే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిన నటి..
దిశ, సినిమా: బాలీవుడ్ నటి ఎవ్లీన్ శర్మ- భర్త తుషాన్ భిండీ తమ మొదటి సంతానానికి స్వాగతం పలికారు. కాగా ఈ శుభసందర్భాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఓ బేబీకి జన్మనిచ్చినట్లు చెప్పిన నటి.. ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నానని తెలిపింది. ఈ మేరకు తన కూతురిని క్యారీ బ్యాగ్‌లో కూర్చోబెట్టుకుని ప్రేమతో ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేసిన ఎవ్లీన్.. ‘నా బిడ్డకు తల్లిగా అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే సమయం […]
దిశ, సినిమా: బాలీవుడ్ నటి ఎవ్లీన్ శర్మ- భర్త తుషాన్ భిండీ తమ మొదటి సంతానానికి స్వాగతం పలికారు. కాగా ఈ శుభసందర్భాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఓ బేబీకి జన్మనిచ్చినట్లు చెప్పిన నటి.. ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నానని తెలిపింది. ఈ మేరకు తన కూతురిని క్యారీ బ్యాగ్‌లో కూర్చోబెట్టుకుని ప్రేమతో ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేసిన ఎవ్లీన్.. ‘నా బిడ్డకు తల్లిగా అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే సమయం ఆసన్నమైంది’ అంటూ కామెంట్ రాసింది. ఇక ఆమె పోస్టుకు స్పందించిన బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్.. ‘ప్రియమైన ఎవ్లీన్ శర్మకు శుభాకాంక్షలు’ అని తెలపగా.. ‘కంగ్రాచ్యులేషన్స్ ఎవ్లీన్’ అంటూ సోనాల్ చౌహాన్ చెప్పింది. అలాగే తన ముద్దుల బేబీ కి ‘అవ భిండీ’ పేరుతో అప్పుడే ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్‌ను ఓపెన్ చేయడం విశేషం.
రోడ్డుపై అభిమాని ఫోన్ లాక్కున్న స్టార్ హీరో.. వీడియో వైరల్