ఓటీటీ రంగంలోకి 'ఈ'టీవీ.. రూ.200 కోట్లతో పక్కా ప్లాన్
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం డిజిటల్ వరల్డ్ లో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కొత్త పునాదులకు శ్రీకారం చుడుతున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి అగ్ర స్థాయి ఓటీటీ సంస్థలు కూడా లోకల్ కంటెంట్ తో ప్రేక్షకులను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ కూడా ఓటీటీ కంపెనీలకు బాగా హెల్ప్ అయ్యింది. ఇక తెలుగులో ఇటీవలే మొదలైన ‘ఆహా’ ఓటిటీ విజయవంతంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. పాండమిక్ సమయంలో థియేటర్స్ మూతబడటంతో.. ఓటీటీలు ప్రత్యామ్నాయంగా మారాయి. […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం డిజిటల్ వరల్డ్ లో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కొత్త పునాదులకు శ్రీకారం చుడుతున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి అగ్ర స్థాయి ఓటీటీ సంస్థలు కూడా లోకల్ కంటెంట్ తో ప్రేక్షకులను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ కూడా ఓటీటీ కంపెనీలకు బాగా హెల్ప్ అయ్యింది. ఇక తెలుగులో ఇటీవలే మొదలైన ‘ఆహా’ ఓటిటీ విజయవంతంగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. పాండమిక్ సమయంలో థియేటర్స్ మూతబడటంతో.. ఓటీటీలు ప్రత్యామ్నాయంగా మారాయి. ఈ నేపథ్యంలో అప్పటికే ఉన్న ఓటీటీలతో పాటుగా కొత్తగా మరిన్ని ఓటీటీలు, ఏటీటీలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్, సన్ ఎన్ఎక్స్ట్ , ఆహా, జీ 5 ,స్పార్క్ వంటి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి చేరనుంది ‘ఈ’టీవీ.
రాబోయే రోజుల్లో ఓటీటీ కంటెంట్ రాజ్యమేలుతుందని భావించిన ప్రముఖ నిర్మాత రామోజీ రావు త్వరలోనే ఓ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉషా కిరణ్ మూవీస్ లో నిర్మించిన ఎన్నో క్లాసిక్ సినిమాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఓటీటీ యాప్ లో మిక్స్ చేయనున్నట్లు సమాచారం. ఇక దీని కోసం రామోజీరావు దాదాపు రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఈ ఓటిటీ లో పాత సినిమాలతో పాటు కొత్త సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా నిర్మాత రామోజీరావు ఓటీటీ పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు గట్టిగానే మొదలుపెట్టినట్లు సమాచారం. మరి అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ని దాటుకొని రామోజీరావు తన ఓటిటీ ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.