‘ఈటల రాజేందర్‌పై దాడి.. స్కెచ్ వేసిన టీఆర్ఎస్’

దిశ, హుజురాబాద్ రూరల్: నాకు నేనుగా ఈ నెల 13, 14 తేదీల్లో దాడి చేయించుకుని, కట్లు కట్టుకుని, ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నానని ఓ మంత్రి ప్రచారం చేస్తున్నారని, అయితే అలాంటి స్కెచ్ టీఆర్ఎస్ వాళ్లు వేశారేమోనన్న అనుమానం కలుగుతుందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బరిగీసీ కొట్లాడుతాడు తప్పా.. ఇలాంటి నీచమైన రాజకీయాలకు దిగజారడనేది గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. […]

Update: 2021-10-03 06:29 GMT

దిశ, హుజురాబాద్ రూరల్: నాకు నేనుగా ఈ నెల 13, 14 తేదీల్లో దాడి చేయించుకుని, కట్లు కట్టుకుని, ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నానని ఓ మంత్రి ప్రచారం చేస్తున్నారని, అయితే అలాంటి స్కెచ్ టీఆర్ఎస్ వాళ్లు వేశారేమోనన్న అనుమానం కలుగుతుందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బరిగీసీ కొట్లాడుతాడు తప్పా.. ఇలాంటి నీచమైన రాజకీయాలకు దిగజారడనేది గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. ఒక వేళ అలాంటిదే జరిగితే మాత్రం అగ్నిగుండమవుతుందని, ఇందుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గతంలో తాను పాదయాత్ర చేసినందున కాలుకు నొప్పి వస్తే కూడా హరీష్ రావు లాంటి వాళ్లు ఇలాగే మాట్లాడారన్నారు. ఫేక్ లెటర్లు సృష్టించి బద్నాం చేశారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యేలకు 2+2 గన్ మెన్ ఉంటారని.. తనకు మాత్రం ఒక్కరినే ఇచ్చారన్నారు. అయినా తనలాంటి వాడికి గన్ మెన్ అవసరం లేదని.. తనను ప్రజలు, కార్యకర్తలే రక్షించుకుంటారన్నారు.

హుజురాబాద్‌లో బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓట్లడిగితే చాలని వాళ్లు తమ ఓట్లు వేసి గెలిపిస్తారని ఈటల ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేశారని, మద్యం సీసాలను, డబ్బు సంచులను టీఆర్ఎస్ పార్టీ నాయకులు నమ్ముకున్నారని ఆరోపించారు. అలాంటి కుట్రలకు హుజురాబాద్ ప్రజలు తగిన సమాధానం చెప్పితీరుతారన్నారు. 30న జరిగే ఎన్నికలో ప్రజలంతా వెల్లువలా బయటకు వచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తారన్నారు. కార్యకర్తలంతా బాధ్యతగా పని చేసుకోవాలని, ఐదు నెలల పాటు ఎన్నికల వాతావరణాన్ని భరించాం.. మరో నెల రోజులు మన శక్తినంతా కూడగట్టుకుని కాషాయ జెండాను ఎగురవేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ధర్మారావు, కూన శ్రీశైలంగౌడ్, నాయకులు గంగాడి కృష్ణారెడ్డి, రావు పద్మ, బండ కార్తీక రెడ్డి, తుల ఉమ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్, విక్రమ్ రెడ్డి, హరీష్ రెడ్డి, రమా దేవి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News